తెలంగాణ దశాబ్ది ఉత్సవాల షెడ్యూల్ ప్రకటించిన సీఎం కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను జూన్ 2 నుంచి 22 వరకు ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Update: 2023-05-24 04:20 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను జూన్ 2 నుంచి 22 వరకు ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సచివాలయంలో మంగళవారం ఉత్సవాల రోజువారీ కార్యక్రమాల షెడ్యూల్ ను సీఎం కేసీఆర్ ప్రకటించారు. జూన్ 2న హైదరాబాద్ లోని గన్ పార్క్ అమరవీరుల స్థూపం వద్ద సీఎం నివాళులర్పించి ఉత్సవాలను ప్రారంభించనున్నారు. అనంతరం సచివాలయం ప్రాంగణంలో కేసీఆర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి దశాబ్ది ఉత్సవ సందేశమిస్తారు.

-జూన్ 3న ‘తెలంగాణ రైతు దినోత్సవం’. రాష్ట్రంలోని అన్ని రైతు వేదికలు కేంద్రంగా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహిస్తారు. వ్యవసాయ రంగంలో సాధించిన విజయాలపై చర్చ.

-4వ తేదీన పోలీసు శాఖ ఆధ్వర్యంలో ‘సురక్ష దినోత్సవం’. శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసుల కృషి, ఫ్రెండ్లీ పోలీస్ సేవలపై కార్యక్రమాలు.

-5వ తేదీన ‘తెలంగాణ విద్యుత్ విజయోత్సవం’. నియోజకవర్గ స్థాయిలో రైతులు, వినియోగదారులు, విద్యుత్ ఉద్యోగులు, ప్రజా ప్రతినిధులతో సమావేశం. సాధించిన గుణాత్మక మార్పు పై వివరణ. సాయంత్రం రవీంద్రభారతిలో రాష్ట్ర స్థాయి సమావేశం. సింగరేణి సంబురాలు.

-6న ‘తెలంగాణ పారిశ్రామిక ప్రగతి ఉత్సవం’. పారిశ్రామిక వాడలు, ఐటీ కారిడార్లలో సభలు. ఆయా రంగాల్లో సాధించిన ప్రగతిని వివరణ.

-7న ‘సాగునీటి దినోత్సవం’. సాగునీటి రంగంలో విజయాలపై సభలు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో సమావేశం. హాజరుకానున్న సీఎం.

-8న ‘ఊరూరా చెరువుల పండుగ’. బోనాలు, బతుకమ్మలతో సాంస్కృతిక కార్యక్రమాలు. మత్స్యకారుల వలల ఊరేగింపులు. సహపంక్తి భోజనాలు.

-9న ‘తెలంగాణ సంక్షేమ సంబురాలు’. నియోజకవర్గ స్థాయిలో సంక్షేమ పథకాల లబ్ధిదారులతో సభలు. సంక్షేమ విజయంపై రవీంద్ర భారతిలో సభ.

=10న ‘తెలంగాణ సుపరిపాలన దినోత్సవం’. అన్ని జిల్లా కేంద్రాల్లో సమావేశాలు. రాష్ట్రంలో పరిపాలన సంస్కరణలపై కార్యక్రమాలు.

-11న ‘తెలంగాణ సాహిత్య దినోత్సవం’. జిల్లాస్థాయిలో కవి సమ్మేళనాలు, రవీంద్రభారతిలో కవి సమ్మేళనం. జిల్లా, రాష్ట్రస్థాయిలో కవితల పోటీలు.

-12న ‘తెలంగాణ రన్’. పోలీసు శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ రన్.

-13న ‘తెలంగాణ మహిళా సంక్షేమ దినోత్సవం’. మహిళల సంక్షేమ పథకాల వివరణ. ఉత్తమ మహిళా ఉద్యోగులకు సన్మానం.

-14న తెలంగాణ వైద్యారోగ్య దినోత్సవం. వైద్య, ఆరోగ్య రంగంలో జరిగిన విప్లవాత్మక అభివృద్ధి గురించి వివరణ. హైదరాబాద్ లోని నిమ్స్ నూతన భవన నిర్మాణానికి, విస్తరణ పనులకు సీఎం శంకుస్థాపన.

-15న తెలంగాణ పల్లె ప్రగతి దినోత్సవం. సాధించిన ప్రగతిపై కార్యక్రమాలు. ఉత్తమ గ్రామ పంచాయతీల సర్పంచులకు, ఎంపీపీలకు సన్మానం.

-16న తెలంగాణ పట్టణ ప్రగతి దినోత్సవం. కార్పొరేషన్, మున్సిపాలిటీలు, సాధించిన ప్రగతి, ప్రభుత్వ పథకాల లబ్ధిని తెలిపే కార్యక్రమాలు.

-17న తెలంగాణ గిరిజనోత్సవం. నూతనంగా ఏర్పడిన గిరిజన గ్రామాల్లో సభలు. గిరిజన సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకున్న చర్యలపై వివరణ.

-18న ‘తెలంగాణ మంచి నీళ్ల పండుగ’. మిషన్ భగీరథ పై కార్యక్రమాలు.

-19న హరితోత్సవం. గ్రామాలు, పట్టణాల్లో మొక్కలు నాటే కార్యక్రమం.

-20న తెలంగాణ విద్యా దినోత్సవం. విద్యా సంస్థల్లో సభలు. ‘మన ఊరు మన బడి’ పాఠశాలల ప్రారంభం. 10 వేల గ్రంథాలయాలు, 1,600 డిజిటల్ క్లాస్ రూమ్స్ ప్రారంభం. వ్యాసరచన, చిత్రలేఖనం, పాటల పోటీలు.

-21న తెలంగాణ ఆధ్యాత్మిక దినోత్సవం. దేవాలయాలు, మసీదులు, చర్చీలు, ఇతర మత ప్రార్థనా మందిరాల్లో వివిధ కార్యక్రమాలు.

-22న ‘అమరుల సంస్మరణ’. తెలంగాణవ్యాప్తంగా అమరులకు శ్రద్ధాంజలి. ట్యాంక్ బండ్ పై కళాకారులతో భారీ ర్యాలీ. అమరుల స్మారక ఆవిష్కరణ.

Tags:    

Similar News