CM Revanth Reddy: ఆ సినిమా నిషేధంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం
నటి కంగనా రనౌత్ స్వీయ దర్శకత్వం వహించిన ‘ఎమర్జెన్సీ’ చిత్రం వివాదంలో చిక్కుకుంది.
దిశ, వెబ్‌డెస్క్: నటి కంగనా రనౌత్ స్వీయ దర్శకత్వం వహించిన ‘ఎమర్జెన్సీ’ చిత్రం వివాదంలో చిక్కుకుంది. ఇండియన్ తొలి మహిళా ప్రధాని ఇందిరా గాంధీ రాజకీయ జీవితం గురించి ఈ మూవీ తెరకెక్కింది. కాగా తమ వర్గం గురించి తప్పుగా సినిమా తీశారని శిరోమణి గురుద్వార ప్రబంధన్ కమిటీ పేర్కొన్న విషయం తెలిసిందే. దీంతో బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ తో పాటు పలువురుకు లీగల్ నోటీసులు వచ్చాయి. ఆగస్టు 14 వ తారీకున విడుదలైన ఈ మూవీ ట్రైలర్ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ నుంచి తొలగించాలని , మా కమ్యూనిటీకి మేకర్స్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అయితే తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి న్యాయ నిపుణుల అభిప్రాయం మేరకు సినిమాను నిషేధించేందుకు ప్రయత్నిస్తానని సిక్కులకు హామీ ఇచ్చారు. ఈ చిత్రంలో తమ వర్గాన్ని ఉగ్రవాదులు, దేశ ద్రోహులుగా చిత్రీకరించారని 18 మంది సభ్యుల సిక్కు బృందం సర్కారు సలహాదారు షబ్బీర్ అలీ వద్ద ఆందోళన వ్యక్తం చేసింది. దీంతో ఆయన ఈ ఇష్యూను ముఖ్యమంత్రి రేవంత్ దృష్టికి తీసుకెళ్లారు.