CM రేవంత్ రెడ్డి నివాసంలో ముఖ్య నేతలు భేటీ

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు భేటీ అయ్యారు. బుధవారం జరిగే కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం, అభ్యర్థుల ఎంపికపై చర్చిస్తున్నట్లు సమాచారం.

Update: 2024-03-26 16:36 GMT

దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు భేటీ అయ్యారు. బుధవారం జరిగే కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం, అభ్యర్థుల ఎంపికపై చర్చిస్తున్నట్లు సమాచారం. ఈ సమావేశంలో ఏఐసీసీ ఇన్‌చార్జి దీపాదాస్ మున్షీ, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస రెడ్డిలు పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో నిర్వహించబోయే సభ ఏర్పాట్లపైనా చర్చ జరిగింది.

తుక్కుగూడ నుంచే జాతీయ రాజకీయాల్లో మార్పు తీసుకువచ్చేందుకు కాంగ్రెస్ రెడీ అయిందని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఏప్రిల్ 6 లేదా 7 తేదీల్లో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నట్లు వెల్లడించారు. జాతీయ స్థాయి మేనిఫెస్టో రిలీజ్‌కు చీఫ్​గెస్టులుగా ఏఐసీసీ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీలు హాజరు కానున్నారని స్పష్టం చేశారు. 14 స్థానాల్లో గెలుస్తామనే నమ్మకం ఉన్నదని, ఇందుకు ప్రతీ కార్యకర్త శ్రమించాల్సిన అవసరం ఉన్నదన్నారు. 

Tags:    

Similar News