చంద్రబాబుని బేషరతుగా విడుదల చేయాల్సిందే: తెలంగాణ టీడీపీ

టీడీపీ జాతీయ అద్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్‌ను నిరసిస్తూ సోమవారం టీడీపీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌లో నిరసన దీక్ష చేపట్టారు. టీడీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

Update: 2023-09-11 06:31 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : టీడీపీ జాతీయ అద్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్‌ను నిరసిస్తూ సోమవారం టీడీపీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌లో నిరసన దీక్ష చేపట్టారు. టీడీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. స్కిల్ స్కాం పేరుతో చంద్రబాబును అరెస్ట్ చేయడం దారుణం అన్నారు. జగన్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని, లేకుంటే రాబోయే రోజుల్లో ప్రజల గుణపాఠం చెబుతారన్నారు. సంబంధం లేని కేసులు పెట్టి చంద్రబాబును జైలుకు తరలించడం అన్యాయమన్నారు. బేషరతుగా కేసులను విత్‌డ్రా చేసుకోవాలని డిమాండ్ చేశారు.

చంద్రబాబును విడుదల చేసే వరకు నిరసన కార్యక్రమాలు చేపడతామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ ఉపాధ్యక్షులు సామా భూపాల్ రెడ్డి, జాతీయ కార్యదర్శి కాసాని వీరేష్, పోలిట్ బ్యూరో సభ్యులు నర్సింహులు, క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడు బంటు వెంకటేశ్వర్లు, మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసన్న, తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు భవనం షకీలా రెడ్డి, సూర్యదేవర లత, టీడీపీ అనుబంధ సంఘాల నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. పార్టీ శ్రేణులు భారీగా తరలిరావడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా పోలీసులను భవన్ ఎదుట మోహరించారు.

Tags:    

Similar News