BRS ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లోకి పంపేది కేసీఆరే: కేంద్ర మంత్రి బండి సంచలన వ్యాఖ్యలు
తెలంగాణ పాలిటిక్స్‌లో పార్టీ ఫిరాయింపుల ఇష్యూ హాట్ టాపిక్‌గా మారింది. రాష్ట్రంలో ప్రధాన పార్టీలు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య పార్టీ
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ పాలిటిక్స్‌లో పార్టీ ఫిరాయింపుల ఇష్యూ హాట్ టాపిక్‌గా మారింది. రాష్ట్రంలో ప్రధాన పార్టీలు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య పార్టీ ఫిరాయింపుల వ్యవహారంపై మాటల తుటాలు పేలుతున్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను యధేచ్చగా పార్టీలో చేర్చుకుని కాంగ్రెస్ ఫిరాయింపులకు పాల్పడుతుందని బీఆర్ఎస్ విమర్శిస్తుండగా.. మా పాలన చూసి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే కాంగ్రెస్‌లో చేరుతున్నారని అధికార పార్టీ కౌంటర్ ఇస్తుంది. అసలు తెలంగాణలో పార్టీ ఫిరాయింపులు ప్రోత్సాహించిందే కేసీఆర్ అని గులాబీ దళంపై హస్తం పార్టీ రివర్స్ ఎటాక్ చేస్తోంది. ఈ క్రమంలో పార్టీ ఫిరాయింపులపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం శంషాబాద్‌లోని టీ బీజేపీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో బండి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అధికార కాంగ్రెస్ పార్టీలోకి పంపించేది కేసీఆరేనని సంచలన వ్యాఖ్యలు చేశారు.
గులాబీ పార్టీ ఎమ్మెల్యేల ఫిరాయింపుల వెనక కేసీఆరే ఉన్నారని.. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన అవినీతి కేసుల నుండి బయటపడేందుకు కేసీఆర్ ప్రభుత్వానికి సహకరిస్తున్నారని.. ఇందులో భాగంగానే ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లోకి పంపుతున్నారని బండి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇక, కాంగ్రెస్ తప్పుడు హామీలతో అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి పోలీసుల ద్వారా నిరుద్యోగులను అణిచివేస్తున్నారని బండి ఫైర్ అయ్యారు. ఇచ్చిన హామీలు అమలు చేయలేక చేతులెత్తేయండతో ఆరు నెలల్లోనే కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని.. ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికలే ఇందుకు నిదర్శనమని అన్నారు. తెలంగాణలో ప్రజలకు బీజేపీపై విశ్వాసం పెరిగిందని అన్నారు. అసలు గ్యారంటీ మోడీదేనంటూ ప్రజలకు బలంగా నమ్ముతున్నారని.. తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వేమేనని బండి జోస్యం చెప్పారు.