ఆలయంలో మార్మోగిన రామనామం

Update: 2023-04-07 08:55 GMT

దిశ,యాచారం: మండలంలోని నల్లవెళ్లి గ్రామంలోని బొగ్గుల గుట్ట శ్రీసీతారామ ఆలయంలో రథోత్సవం అంగరంగ వైభవంగా శుక్రవారం జరిగింది. అందులో భాగంగా తెల్లవారుజామున రథోత్సవం నిర్వహించారు. వేకువజాము నుంచే వేలాదిగా తరలివచ్చిన భక్తులతో ఆలయం జనసంద్రంగా మారింది. ఈ ఘట్టం దాదాపు నాలుగు గంటల పాటు కోలాహలంగా సాగింది. వివిధ జిల్లాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అక్కడే జాగారణ చేసి ఉదయం రథోత్సవంలో పాల్గొన్నారు. మధ్యాహ్నం వరకు ఆలయ పరిసరాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. తెల్లవారుజామున రథాన్ని పూలతో అలంకరించగా అలయ చైర్మన్‌

గండికోట యాదయ్యతో పాటుగా కమిటీ సభ్యులు ప్రారంభించారు. బ్రహ్మోత్సవాల్లో వేలాది మంది భక్తులు తరలిరావడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ డేరంగుల రాజు, ఎంపీటీసీ ఓరుగంటి లక్ష్మిపతి గౌడ్ , ఉపసర్పంచ్ వినోద్, దేవాలయ కమిటీ సభ్యులు సత్యనారాయణ, పొనగంటీ మోహన్, యాదయ్య, శోభ రాములు, గ్రామస్తులు కాసాని రవి గౌడ్ తదితులు పాల్గొన్నారు..



రథోత్సవానికి హాజరైన ఎమ్మేల్యే

నల్లవెళ్లి గ్రామంలోని బొగ్గుల గుట్ట శ్రీసీతారామ ఆలయంలో రథోత్సవానికి ఇబ్రహీంపట్నం ఎమ్మేల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి హాజరయ్యారు. అనంతరం ఎమ్మేల్యే మాట్లాడుతూ... దేవాలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలు అన్నారు. దేవాలయ రోడ్డు నిర్మాణం లో భాగంగా రూ. 10 లక్షలు నిధులు ప్రకటించారు. దీనిపై ఆలయ కమిటీ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. 

Tags:    

Similar News