మహిళల భద్రత కోసమే సీడీఈడబ్ల్యు కేంద్రాలు: అదనపు డీజీ షిఖా గోయల్
మహిళలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో గృహ హింస మొదటిదని మహిళా భద్రతా విభాగం అదనపు డీజీ షిఖా గోయల్అన్నారు. చాలామంది మహిళలు ఈ హింసను మౌనంగా భరిస్తున్నారు తప్పితే బయటకు చెప్పుకోవటం లేదని చెప్పారు.
దిశ, తెలంగాణ క్రైం బ్యూరో : మహిళలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో గృహ హింస మొదటిదని మహిళా భద్రతా విభాగం అదనపు డీజీ షిఖా గోయల్అన్నారు. చాలామంది మహిళలు ఈ హింసను మౌనంగా భరిస్తున్నారు తప్పితే బయటకు చెప్పుకోవటం లేదని చెప్పారు. ఇలాంటి మహిళల సమస్యలను పరిష్కరించేందుకు సేఫ్‌సిటీ ప్రాజెక్టులో భాగంగా ట్రై కమిషనరేట్లలో 26 సెంటర్ఫర్డెవలప్మెంట్అండ్ఎంపవర్మెంట్ఆఫ్ఉమెన్(సీడీఈడబ్ల్యు) కేంద్రాలను ప్రారంభించాలని నిర్ణయించినట్టు చెప్పారు. రాచకొండ కమిషనరేట్పరిధిలో మంగళవారం ఎల్బీనగర్లో ఈ సెంటర్‌ను ప్రారంభించిన సందర్భంగా ఆమె మాట్లాడుతూ చిన్న చిన్న సమస్యల వల్ల కూడా కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయన్నారు. ఈ పరిస్థితిని నివారించటానికే ఈ కౌన్సెలింగ్సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు.
ఈ సెంటర్లలో నిపుణులైన కౌన్సెలర్లు ఉంటారన్నారు. వీలైనంత మేరకు కుటుంబాలు విచ్ఛిన్నం కాకుండా వీళ్లు కౌన్సెలింగ్చేస్తారన్నారు. అప్పటికీ రాజీ కుదరక పోతే కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటారని వివరించారు. రాచకొండ కమిషనర్డీ.ఎస్.చౌహాన్మాట్లాడుతూ మహిళా సాధికారిత, రక్షణ, గృహ హింస, బాహ్య హింస, వేధింపుల నుంచి రక్షణ కల్పించేందుకు ఈ సెంటర్లు దోహద పడతాయని చెప్పారు. మంగళవారం కమిషనరేట్పరిధిలో అయిదు సెంటర్లను ప్రారంభించినట్టు తెలిపారు. త్వరలోనే మరో రెండు కేంద్రాలను ప్రారంభించనున్నట్టు చెప్పారు. బహిరంగ ప్రదేశాల్లో, ఆన్లైన్ఈవ్టీజింగ్, వేధింపులను అరికట్టటం, సైబర్స్టాకింగ్పై అవగాహన కల్పించే నిమిత్తం షార్ట్‌ఫిల్మ్‌లను రూపొందిస్తున్నట్టు తెలిపారు. మహిళల భద్రతకు సంబంధించి అవగాహన కల్పించేందుకు ఆడియో, వీడియో వ్యాన్‌ను కూడా ఉపయోగించనున్నట్టు వివరించారు. ఉప్పల్‌లో జాయింట్కమిషనర్సత్యనారాయణ, కుషాయిగూడలో డీసీపీ (అడ్మిన్) పీ.ఇందిర, మీర్పేట్లో ఎల్బీనగర్డీసీపీ సాయిశ్రీ, పహాడీషరీఫ్‌లో సైబర్క్రైమ్స్డీసీపీ బీ.అనురాధ, మహేశ్వరం డీసీపీ శ్రీనివాస్‌లు ఈ కేంద్రాలను ప్రారంభించినట్టు తెలిపారు. కార్యక్రమంలో రోడ్డు భద్రత, మహిళా భద్రత ఇంఛార్జ్శ్రీబాల, ఎల్బీనగర్ఏసీపీ శ్రీధర్‌రెడ్డి, షీ టీమ్స్ఏసీపీ వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.