ఐదుగురు ఐఏఎస్‌లకు దక్కని ఊరట.. క్యాట్ కీలక తీర్పు

ఐఏఎస్‌(CAT)ల పిటిషన్లపై క్యాట్ కీలక తీర్పు వెలువరించింది. ఐదుగురు ఐఏఎస్‌(IAS)లకు షాకిచ్చింది.

Update: 2024-10-15 11:40 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఐఏఎస్‌(CAT)ల పిటిషన్లపై క్యాట్ కీలక తీర్పు వెలువరించింది. ఐదుగురు ఐఏఎస్‌(IAS)లకు షాకిచ్చింది. డీఓపీటీ(DOPT) ఇచ్చిన ఆదేశాలు పాటించాలని తీర్పు ఇచ్చింది. రేపు ఎక్కడివాళ్లు అక్కడ రిపోర్ట్ చేసి తీరాలని ఆదేశాలు ఇచ్చింది. అంతకుముందు క్యాట్‌లో కీలక వాదనలు కొనసాగాయి. IAS అధికారులపై క్యాట్‌ కీలక వ్యాఖ్యలు చేసింది. ఏపీలో వరదలతో ప్రజలు ఇబ్బందిపడుతున్నారు, వారికి సేవచేయాలని లేదా? అని ప్రశ్నించింది.

స్థానికత ఉన్నప్పటికీ, స్వాపింగ్‌ చేసుకోవచ్చని గైడ్‌లైన్స్‌లో ఉందా? అని అడిగింది. ఐఏఎస్‌ల కేటాయింపుపై డీఓపీటీకి నిర్ణయం తీసుకునే అధికారం ఉందని గుర్తుచేసింది. వన్‌ మెన్‌ కమిటీ సిఫారసులను డీఓపీటీ ఎలా అమలు చేస్తుంది. వన్‌ మెన్‌ కమిటీ సిఫారసు చేసినప్పుడు ఎందుకు హైకోర్టుకు వెళ్లలేదని ఐఏఎస్‌లను క్యాట్‌ ప్రశ్నించింది. కాగా, డీఓపీటీ జారీ చేసిన ఉత్తర్వులు రద్దుచేయాలని ఐఏఎస్‌లు క్యాట్‌ను ఆశ్రయించిన సంగతి తెలిసిందే.


Similar News