Bitthiri Sathi : బిత్తిరి సత్తి పై కేసు నమోదు.. సైబర్ క్రైమ్‌లో ఫిర్యాదు

తెలంగాణ యాసతో గుర్తింపు పొందిన నటుడు బిత్తిరి సత్తి (చేవెళ్ల రవి) ఓ షాట్ వీడియోతో వివాదం ఏర్పడింది. ఆయనపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయింది.

Update: 2024-08-07 08:07 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ యాసతో గుర్తింపు పొందిన నటుడు బిత్తిరి సత్తి (చేవెళ్ల రవి) ఓ షాట్ వీడియోతో వివాదం ఏర్పడింది. ఆయనపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయింది. భగవద్గీతను కించపరచేలా వీడియో చేశాడని బిత్తిరి సత్తిపై రాష్ట్రీయ వానరసేన తాజాగా ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

కాగా, బిల్లుగీత అంటూ బిత్తిరి సత్తి పేరడీగా ఒక షాట్ వీడియో చేశాడు. వీడియోలో భగవద్గీతను అనుకరిస్తూ.. తనదైన శైలిలో వ్యంగ్యంగా సత్తి ఆ షాట్ వీడియో చేశాడు. దీనికి సంబంధించిన వీడియో తాజాగా నెట్టింట చక్కర్లు కొడుతోంది. దీంతో ఈ షాట్ వీడియోపై హిందూ సంఘాలు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో వీడియోను తొలగించి క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేశారు. 

Tags:    

Similar News