సందడిగా సచివాలయ ప్రాంగణం.. కేటీఆర్ తొలి సంతకం ఆ ఫైల్ పైనే..!
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కొత్త సచివాలయ ప్రాంగణంలో సందడి వాతావరణం నెలకొంది.
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కొత్త సచివాలయ ప్రాంగణంలో సందడి వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమాల్లో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి దంపతులు సుదర్శన యాగం, చండీహోమంలో పాల్గొన్నారు. అయితే సీఎం కేసీఆర్ మధ్యాహ్నం 1.20 గంటలకు కొత్ సెక్రటేరియట్ చేరుకుంటారు. హోమశాలలో పూజలో పాల్గొంటారు. శిలాఫలాకాన్ని ప్రారంభించి కింది అంతస్తులో వాస్తు పూజలో పాల్గొటారు. అనంతరం సచివాలయం సమీకృత కార్యాలయానికి రిబ్బన్ కట్ చేసి 6వ అంతస్తులోని తన ఛాంబర్ లో కొలువుదీరనున్నారు.
డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీ మార్గదర్శకాలపై కొత్త సచివాలయంలో కేటీఆర్ తొలి సంతకం చేయనున్నారు. సచివాలయం ప్రారంభం కారణంగా ట్యాంక్ బండ్ నుంచి వచ్చే వాహనాలను దారి మళ్లిస్తున్నారు. ట్యాంక్ బండ్ పరిసరాల్లో ఇప్పటికే పార్క్ లను మూసివేశారు. ట్యాంక్ బండ్ నుంచి వచ్చే వాహనాలను దారి మళ్లించారు. ఎన్టీఆర్ ఘాట్, బీఆర్కే భవన్, నెక్లెస్ రోడ్లలో వాహనాలను పార్కింగ్ చేయడానికి ఏర్పాట్లు చేశారు. సచివాలయాన్ని పూలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. పోలీసులను భారీగా మోహరించారు.