సీఎం ఫ్యామిలీకే ప్రాథమిక హక్కులు ఉంటయా?
సీఎం ఫ్యామిలీకే ప్రాథమిక హక్కులు ఉంటాయా? అని బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గురువారం ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు.
దిశ, డైనమిక్ బ్యూరో: సీఎం ఫ్యామిలీకే ప్రాథమిక హక్కులు ఉంటాయా? అని బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గురువారం ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. సుప్రీంకోర్టులో తన పిటిషన్ ఈనెల 24న విచారణ జరగాల్సి ఉన్నందున నేడు ఈడీ విచారణకు రాలేనంటూ ఎమ్మెల్సీ కవిత తన లాయర్ సోమాభరత్ తో ఈడీకి సమాచారం పంపిన సంగతి తెలిసిందే. ఈ నేఫథ్యంలో ఈడీకి సమాచారం అందించిన అనంతరం సోమాభరత్ మీడియాతో మాట్లాడుతూ.. మహిళలు, పిల్లలను కార్యాలయానికి పిలిచి, రాత్రి వరకు విచారించడం సరికాదని, వారికి ప్రాథమిక హక్కులు ఉంటాయని ఆయన వ్యాఖ్యానించారు. దీనిపై స్పందించిన ఆర్ఎస్పీ మరి అడ్డగూడూర్ మరియమ్మకు, నేరెళ్ల కోలా హరీష్‌కు, మెదక్ ఖదీర్ ఖాన్‌కు ప్రాథమిక హక్కులు ఉండవా? ముఖ్యమంత్రి కుటుంబానికే ఉంటయా? అని ఈ సందర్భంగా ఆయన నిలదీశారు.
మరి అడ్డగూడూర్ మరియమ్మకు, నేరెళ్ల కోలా హరీష్ కు, మెదక్ ఖదీర్ ఖాన్ కు Fundamental Rights ఉండవా? ముఖ్యమంత్రి కుటుంబానికే ఉంటయా? pic.twitter.com/EACMJX71hX
— Dr.RS Praveen Kumar (@RSPraveenSwaero) March 16, 2023