తెలంగాణకు బీఎస్పీ జాతీయ అధ్యక్షురాలు మాయావతి..

Update: 2023-05-05 16:46 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో మే 7వ తేదీన ఆదివారం సరూర్ నగర్ స్టేడియంలో నిర్వహించబోయే తెలంగాణ భరోసా బహిరంగ సభకు ముఖ్య అతిథిగా బీఎస్పీ జాతీయ అధ్యక్షురాలు మాయావతి రానున్న విషయం తెలిసిందే. ఆదివారం జరగబోయే కార్యక్రమానికి హాజరుకావడానికి ఒక రోజు ముందే, నేడు సాయంత్రం మాయావతి హైదరాబాద్ చేరుకోనున్నారు. ఈ నేపథ్యంలో ఏడు రాష్ట్రాల ఇంచార్జీ, నేషనల్ కో ఆర్డినేటర్ రాజ్యసభ ఎంపీ రాంజీ గౌతమ్, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఇతర రాష్ట్ర నాయకులు ఘన స్వాగతం పలికేందుకు తగిన ఏర్పాట్లు సిద్ధం చేశారు.

Tags:    

Similar News