గుర్తింపు సంఘం ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్యానల్ ఘన విజయం
లోక్‌సభ ఎన్నికల్లో ఘోర ఓటమిపాలైన బీఆర్ఎస్ పార్టీకి కాస్త ఉపశమనం అందించే ఓ తీపి కబురు అందింది.
దిశ, డైనమిక్ బ్యూరో: లోక్‌సభ ఎన్నికల్లో ఘోర ఓటమిపాలైన బీఆర్ఎస్ పార్టీకి కాస్త ఉపశమనం అందించే ఓ తీపి కబురు అందింది. పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం బసంత్ నగర్‌లోని కేశోరాం సిమెంట్స్ ఫ్యాక్టరీ గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్యానల్ నాయకుడు కౌశిక్ హరి ప్యానల్ ఘన విజయం సాధించింది. ఎన్నికల్లో మొత్తం 788 ఓట్లు పోలవగా కౌశిక్ హరి ప్యానల్ 418 ( బీఆర్ఎస్), బయ్యపు మనోహర్ రెడ్డి ప్యానెల్‌కు351 (కాంగ్రెస్), దేవీ లక్ష్మీనరసయ్య ప్యానల్‌కు 1, కాల్వ నరేష్‌కు 9 లభించాయి ఇందులో 7 ఓట్లు చెల్లలేదు.
కౌశిక్ హరి ప్యానల్ గెలుపుతో బీఆర్‌ఎస్ శ్రేణుల సంబురాలు చేసుకున్నారు. పటాకులు కాల్చి స్వీట్లు పంచి పెట్టి సెలబ్రేషన్స్ జరుపుకున్నారు.