హైడ్రా పై సంచలన వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే

హైడ్రాపై మహేశ్వరం బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-09-08 14:42 GMT

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ నగరంలో హైడ్రా పెను సంచలనంగా మారింది. అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం మోపుతున్న హైడ్రాపై మహేశ్వరం బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మీడియాలో హడావుడి కోసం హైడ్రా ఓ పబ్లిసిటీ స్టంట్ అని ఆమె తీవ్రంగా మండిపడ్డారు. మడికొండలో బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో పాల్గోని ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో మాజీ సీఎం కేసీఆర్ అభివృద్ధి మార్కును ఎలాగైన తొలగించాలనే కుట్రతో హైడ్రాను ఆయుధంగా వాడుకుంటున్నారన్నారు. అలాగే ప్రజలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చకుండా అన్ని విధాలుగా బీఆరఎస్ ప్రభుత్వంపై బురద జల్లే కార్యక్రమాలను చేపడుతన్నారని ఎమ్మెల్యే సబితా ఇంద్రా రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు.


Similar News