నల్లగొండలో సభ పెట్టడానికి ప్రధాన కారణం అదే.. జగదీశ్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

కాంగ్రెస్ నేతలపై మాజీ మంత్రి, సూర్యాపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సీరియస్ కామెంట్స్ చేశారు. సోమవారం నల్లగొండలో కేసీఆర్ నిర్వహించబోయే బహిరంగ సభ ఏర్పాట్లను జగదీష్ రెడ్డి పరిశీలించారు.

Update: 2024-02-12 12:09 GMT

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ నేతలపై మాజీ మంత్రి, సూర్యాపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సీరియస్ కామెంట్స్ చేశారు. సోమవారం నల్లగొండలో కేసీఆర్ నిర్వహించబోయే బహిరంగ సభ ఏర్పాట్లను జగదీష్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. కేవలం కాంగ్రెస్ నాయకుల చేతగానితనం వల్లే కృష్ణా జలాలపై హక్కులు కోల్పోయామని అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతో కాంగ్రెస్ పార్టీ లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్నదని ఆరోపించారు. కృష్ణా జలాల వివాదం రాష్ట్ర ప్రజల జీవన్మరణ సమస్యగా పేర్కొన్నారు. కాంగ్రెస్ కుట్రను బయటపెట్టేందుకు రేపు నల్లగొండలో కార్యక్రమం చేపట్టామని చెప్పారు.

కృష్ణా జలాల పరిరక్షణే తమ ప్రధాన అజెండా అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజల ఆదరణ కోల్పోతుందని అన్నారు. రెండు నెలల్లోనే ప్రజల్లో అసహనం కనిపిస్తోందని తెలిపారు. ఇచ్చిన హామీలు పక్కన బెట్టి అస్తమానం బీఆర్ఎస్ ప్రభుత్వం ఆరోపణలు చేయడాన్ని ప్రజలు గమనిస్తున్నారని వెల్లడించారు. దమ్ముంటే గ్యారంటీలు అమలు చేసి చూపించాలని డిమాండ్ చేశారు. అధికార దాహంతో అమలుకు సాధ్యం కానీ హామీలు గుప్పించి ప్రజలను మభ్యపెట్టారని మండిపడ్డారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక వాటిని అమలు చేయలేక చేతులెత్తేశారని విమర్శించారు.

Tags:    

Similar News