బీఆర్ఎస్ పార్టీలోనే దొంగలున్నారు.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ సంచలన వ్యాఖ్యలు

బీఆర్ఎస్ కు చెందిన వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Update: 2023-07-13 13:01 GMT

దిశ, వెబ్ డెస్క్: బీఆర్ఎస్ కు చెందిన వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీలోనే దొంగలు ఉన్నారని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. తన నియోజకవర్గంలో తనను పక్కన పెట్టాలని చాలా మంది చూస్తున్నారని మండిపడ్డారు. తనకు పదవిపై ఎలాంటి వ్యామోహం లేదన్న ఆయన.. నియోజకవర్గ ప్రజలు మళ్లీ తననే ఆధారిస్తారనే నమ్మకం తనకుందని అన్నారు. అభిమానం అనేది ప్రజల గుండెల్లో ఉండాలని, ఫ్లెక్సీల్లో కాదని అన్నారు. భూములు కబ్జా చేసినవారిని వదిలిపెట్టనని హెచ్చరించారు. 

Tags:    

Similar News