Breaking News : ఎమ్మెల్యేల అనర్హత కేసులో బీఆర్ఎస్ కీలక నిర్ణయం
ఎమ్మెల్యేల అనర్హత కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

దిశ, వెబ్ డెస్క్ : ఎమ్మెల్యేల అనర్హత కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో(Telangana Assembly Elections) బీఆర్ఎస్ తరుపున గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ పార్టీలోకి మారారు. బీఆర్ఎస్(BRS) బీ ఫారం మీద గెలిచి వేరే పార్టీలోకి వెళ్ళిన వీరందరినీ అనర్హులుగా ప్రకటించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి(Padi Koushik Reddy), కేపీ వివేకానంద(KP Vivekananda) హైకోర్టు(High Court)కు వెళ్లారు. ఇరువైపులా వాదనలు విన్న అనంతరం.. పార్టీ మారిన ఎమ్మెల్యేలను తక్షణమే అనర్హులుగా ప్రకటించాలని స్పీకర్ కు ఆదేశాలు జారీ చేస్తూ హైకోర్ట్ సింగిల్ జడ్జ్ తీర్పునిచ్చారు. సింగిల్ జడ్జి తీర్పుపై అభ్యంతరం తెలుపుతూ.. శాసనసభ సెక్రెటరీ హైకోర్ట్ ప్రత్యేక బెంచ్ కి అప్పీల్ చేయగా.. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై ఎప్పుడైనా చర్య తీసుకునే అధికారం స్పీకరుకి ఉందని, టైమ్ బౌండ్ ఏమీ లేదని తీర్పు ఇచ్చింది. కాగా ఇప్పటి వరకు స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోక పోవడంతో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ అధిష్టానం సుప్రీంకోర్టు(Supreme Court)లో రెండు పిటిషన్లు దాఖలు చేసారు. హరీష్ రావు ముందుగా లీగల్ అడ్వైజ్ తీసుకొని, నేడు పిటిషన్లు వేయడం జరిగింది.