BRS: మీది ఏ పార్టీ అని ప్రశ్నించినందకే కేసులా..? కౌశిక్ రెడ్డి అరెస్ట్ పై హరీష్ రావు

మీది ఏ పార్టీ అని ప్రశ్నించినందకే కేసులా అని, ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదేనా అని మాజీమంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్ రావు(BRS Leader Harish Rao) ప్రశ్నించారు.

Update: 2025-01-13 15:59 GMT

దిశ, వెబ్ డెస్క్: మీది ఏ పార్టీ అని ప్రశ్నించినందకే కేసులా అని, ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదేనా అని మాజీమంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్ రావు(BRS Leader Harish Rao) ప్రశ్నించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి(BRS MLA Padi Koushik Reddy) అరెస్ట్ పై ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government)పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన.. బీఆర్ఎస్ పార్టీ నాయకుడు, హుజరాబాద్(Huzurabad) ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని అక్రమ అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. అలాగే మీది ఏ పార్టీ అని, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేను ప్రశ్నించినందుకే మా కౌశిక్ రెడ్డి మీద కేసులా? అని, కేసీఆర్(KCR) పాలనలో పదేళ్లు ప్రశాంతంగా ఉన్న తెలంగాణ, 13 నెలల కాంగ్రెస్ పాలనలో కక్షపూరిత రాజకీయాలకు నిలయంగా మారడం శోచనీయమని అన్నారు.

ప్రశ్నిస్తున్న ప్రజా ప్రతినిధులపై అక్రమంగా కేసులు బనాయించడం, నిలదీస్తే పార్టీ కార్యాలయాలపై దాడులు చేయడం నిత్యకృత్యం కావడం సిగ్గుచేటు అని దుయ్యబట్టారు. అంతేగాక ఆరు గ్యారంటీలు, హామీల అమలు, పరిపాలనను గాలికి వదిలేసి ప్రతిపక్షాలను వేధించడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అని, ప్రశ్నిస్తే కేసులు, నిలదీస్తే దాడులు, అడిగితే అరెస్టులు.. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదేనా? అని నిలదీశారు. ఇక ఏడవ గ్యారంటీగా ప్రజాస్వామ్య పునరుద్ధరణ అని డబ్బా కొట్టి ఇప్పుడు, ఉన్న ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని, ఎమర్జెన్సీ పాలనను తలపిస్తున్నారని ఆరోపించారు. మీ అణచివేతలకు, మీ నిర్బంధాలకు, మీ దాడులకు బీఆర్ఎస్ పార్టీ అదరదు బెదరదు అని, ప్రజాక్షేత్రంలో మిమ్మల్ని అడుగడుగునా నిలదీస్తూనే ఉంటామని, ప్రజల తరఫున పోరాటం చేస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. అలాగే అక్రమంగా అరెస్టు చేసిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని తక్షణం విడుదల చేయాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన హరీష్ రావు డిమాండ్ చేశారు.

Tags:    

Similar News