BRS గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఖరారు.. అధికారికంగా ప్రకటించిన KCR
నల్లగొండ-ఖమ్మం-వరంగల్ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్ రెడ్డిని ఖరారు చేశారు.
దిశ, వెబ్‌డెస్క్: నల్లగొండ-ఖమ్మం-వరంగల్ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్ రెడ్డిని ఖరారు చేశారు. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం అధికారిక ప్రకటన చేశారు. అయితే, గత పట్టభధ్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పల్లా రాజేశ్వరరెడ్డి విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన జనగామా ఎమ్మెల్యేగా విజయం సాధించారు. దీంతో ఈ స్థానం ఖాళీ అయ్యింది. ఇక ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిని ప్రకటించేసింది.
ఈ స్థానం నుంచి కాంగ్రెస్ తరుఫున తీన్మార్ మల్లన్న పోటీ చేయనున్నారు. ఇవాళ మల్లన్న నామినేషన్ కూడా దాఖలు చేశారు. మరోవైపు ఇప్పటికే బై ఎలక్షన్ నోటిఫికేషన్ విడుదల కాగా.. నేటి నుంచి ఈ నెల 9వ తేదీ వరకూ నామినేషన్లను స్వీకరించనున్నారు. 10 నుంచి నామినేషన్లను పరిశీలించనున్నారు. 13 వరకూ నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు. ఈ నెల 27న పోలింగ్ నిర్వహించనున్నారు. ఈ నియోజకవర్గంలో 4,61,806 మంది పట్టభద్రులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.