కాంగ్రెస్ 6 గ్యారెంటీలకు కౌంటర్ స్ట్రాటెజీ రెడీ.. హస్తాన్ని దెబ్బకొట్టేందుకు BRS భారీ ప్లాన్..!

కాంగ్రెస్ సిక్స్ గ్యారంటీస్ స్ట్రాటెజీ గులాబీ నేతలను డైలమాలోకి నెట్టింది. ఇప్పటికే అందులోని ఒక్కో హామీ ప్రభావం జనంలో ఏ మేరకు ఉన్నదో ఆరా తీస్తున్నది.

Update: 2023-09-22 06:03 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ సిక్స్ గ్యారంటీస్ స్ట్రాటెజీ గులాబీ నేతలను డైలమాలోకి నెట్టింది. ఇప్పటికే అందులోని ఒక్కో హామీ ప్రభావం జనంలో ఏ మేరకు ఉన్నదో ఆరా తీస్తున్నది. ఆ హామీలకు ఆకర్షితులు కాకుండా చూడడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నది. వంద జాకీలు పెట్టినా లేవదని కామెంట్ చేసిన నేతలే ఇప్పుడు సిక్స్ గ్యారంటీల ట్రాప్‌లో పడ్డారనే వ్యాఖ్యలూ వినిపిస్తున్నాయి.

ప్రజలకు రాహుల్ భరోసా

కాంగ్రెస్ నిర్వహించిన విజయభేరి సభలో సిక్స్ గ్యారంటీస్ ప్రకటించిన మరుసటి రోజు నుంచే గులాబీ నేతల నుంచి కౌంటర్ విమర్శలు మొదలయ్యాయి. మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్ ప్రతి బహిరంగ వేదిక మీద ఆచరణ సాధ్యం కాని హామీలంటూ విమర్శిస్తున్నారు. కర్ణాటకలో వంద రోజుల్లోనే గ్యారంటీస్‌ను అమలు చేశామని నొక్కిచెప్పిన రాహుల్‌గాంధీ ఆ రాష్ట్రంలో ఎవరిని అడిగినా వాస్తవం తెలుస్తుందంటూ ప్రజలకు మరింత భరోసా కల్పించారు. దీంతో బీఆర్ఎస్ పకడ్బందీ వ్యూహంతో ప్రజల్లోకి వెళ్లడం అనివార్యమైంది.

కర్ణాటక ఫార్ములా వర్సెస్ తెలంగాణ ప్రాక్టీస్

పదేండ్ల పాలనలోని ఆచరణతో జనంలోకి వెళ్లాలన్నది బీఆర్ఎస్ ప్లాన్. అందుకే ప్రామిసెస్ వర్సెస్ ప్రాక్టీస్ అనే స్లోగన్‌ను విస్తృతం చేయాలనుకుంటున్నది. రైతుబంధు, రైతు బీమా, దళితబంధు, కల్యాణలక్ష్మి, షాదీ ముబా రక్, ఆసరా.. ఇలాంటి స్కీమ్‌లు, వాటి ద్వారా కలిగిన లబ్ధిని ప్రోగ్రెస్ రిపోర్టు తరహా బుక్‌లె ట్‌లను పంపిణీ చేయడంపై ప్లాన్ చేస్తున్నది.

కాంగ్రెస్ స్కీమ్స్‌పై బీఆర్ఎస్ లెక్కలు

ఇంకోవైపు కాంగ్రెస్ ఇస్తున్న హామీలు, సిక్స్ గ్యారంటీస్‌లో ఒక్కోదాన్ని అమలు చేయడానికి ఎంత ఖర్చవుతున్నదో బీఆర్ఎస్ లెక్కలు వేస్తున్నది. వీటన్నింటినీ అమల్లోకి తేవాలంటే రాష్ట్ర మొత్తం బడ్జెట్ దానికే సరిపోతుందని జనం రియలైజ్ అయ్యే తీరులో స్కీమ్‌ల వారీగా లెక్కల ను డిస్‌ప్లే చేయాలన్నది గులాబీ పార్టీ ప్లాన్.

కాంగ్రెస్ యాక్షన్ ప్లాన్

కర్ణాటకలో వంద రోజుల్లోనే అమల్లోకి తెచ్చినప్పుడు తెలంగాణలో ఎందుకు సాధ్యం కాదనే తీరులో కాంగ్రెస్ సైతం విస్తృతంగా జనంలోకి వెళ్లాలనే ప్లాన్ రూపొందించుకున్నది. ఇప్పటికే జాతీయ నేతలంతా ఒక్కో అసెంబ్లీ సెగ్మెంట్‌లో ఒక రోజు రాత్రి బస చేసి సిక్స్ గ్యారంటీస్‌పై ప్రజలకు వివరించారు. ఏఐసీసీ సైతం ఈ గ్యారంటీలే ప్రజల్లో కాంగ్రెస్ పట్ల విశ్వాసాన్ని నెలకొల్పుతుందని సూచించింది. బీఆర్ఎస్ స్కీమ్స్‌లోని ఫెయిల్యూర్స్‌ను ప్రజల ముందుకు తీసుకెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నది.

వైఫల్యాలపై కాంగ్రెస్ చార్జిషీట్

ఇప్పటికే చార్జిషీట్ పేరుతో కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలను ఫ్లెక్సీలు, ప్లకార్డుల రూపంలో ప్రదర్శించడం కాంగ్రెస్ మొదలుపెట్టింది. మంత్రులు, ఎమ్మెల్యేల అవినీతి ఆరోపణలను సైతం ప్రస్తావించింది. కాళేశ్వరం, మిషన్ భగీరథ ప్రాజెక్టుల్లో కాంట్రాక్టుల పేరుతో కమిషన్లు కొట్టేశారంటూ కేసీఆర్ ఫ్యామిలీపై పీసీసీ చీఫ్ రేవంత్ బహిరంగంగానే కామెంట్లు చేశారు. పాలమూరు ప్రాజెక్టు పూర్తికాకపోయినా ఆర్భా టంగా పొలిటికల్ మైలేజ్ కోసం ప్రారంభించారన్న విమర్శలు ఉండనే ఉన్నాయి.

ఇచ్చిన హామీలను గాలికొదిలేసిందంటూ బీఆర్ఎస్ పదేండ్ల పాలనా వైఫల్యాల్లో దళితులకు మూడెకరాల భూమి, నిరుద్యోగ భృతి, అసంపూర్ణంగా ఉన్న దళితబంధు, చేతివృత్తులకు చేయూత, ఫీజు రీఇంబర్స్ మెంట్.. ఇలాంటివాటిని ఎత్తి చూపాలనుకుంటున్నది. బీఆర్ఎస్ పార్టీ ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఎదుర్కోడానికి ప్రామిసెస్ వర్సెస్ ప్రాక్టీసు అనే నినాదంతో జనంలోకి వెళ్ళాలనుకుంటూ ఉంటే కాంగ్రెస్ మాత్రం అమలుకు నోచుకోని హామీలతో ప్రజలను తప్పుదారి పట్టిస్తూ ఆచరణలోని డొల్లతనాన్ని ఎక్స్‌పోజ్ చేయాలనుకుంటున్నది.

Tags:    

Similar News