మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ?
ఎన్నికలు సమీపిస్తోన్న వేళ దేశ రాజకీయాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టి సారించారు. ఈ క్రమంలోనే ఇతర రాష్ట్రాలకు చెందిన ముఖ్య నాయకులను బీఆర్ఎస్‌లోకి ఆహ్వానిస్తున్నారు.
దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికలు సమీపిస్తోన్న వేళ దేశ రాజకీయాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టి సారించారు. ఈ క్రమంలోనే ఇతర రాష్ట్రాలకు చెందిన ముఖ్య నాయకులను బీఆర్ఎస్‌లోకి ఆహ్వానిస్తున్నారు. తాజాగా మరింత స్పీడు పెంచి ఇవాళ(మార్చి 26) మహారాష్ట్ర నాందేడ్ జిల్లాలోని లోహాలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ పార్టీలకు చెందిన స్థానిక మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలను భారీగా బీఆర్ఎస్‌లో చేర్చుకున్నారు. అంతేగాక, త్వరలో మహారాష్ట్రలో జరుగనున్న స్థానిక సంస్థల ఎన్నికలను ఒక అవకాశంగా మలుచుకోవాలని గులాబీ బాస్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రాంతీయ పార్టీగా ఏర్పడ్డ టీఆర్ఎస్.. గతంలో తెలంగాణలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక స్థానాలను కైవసం చేసుకొని తన బలాన్ని నిరూపించుకుంది. క్రమంగా అసెంబ్లీలోనూ పాగా వేసింది. అదే ఫార్మూలను ఇపుడు మహారాష్ట్రలోనూ అనుసరించనున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా తెలంగాణ సరిహద్దున ఆదిలాబాద్ జిల్లాకు ఆనుకొని ఉన్న మహారాష్ట్రలోని యవత్మాల్, వార్ధా, వాసిం, చంద్రపూర్, గడ్చిరోలి జిల్లాలపై కన్నేసిన గులాబీ దళపతి ఆయా జిల్లాల్లో పార్టీ ప్రచారానికి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన పలువురు ముఖ్యనేతలను ఇంచార్జీలుగా కూడా నియమించారు. మరి మహారాష్ట్రలో ఎంతమేరకు సక్సె్స్ అవుతారో చూడాలి.