రేపు అసెంబ్లీకి కేసీఆర్ రావడం కష్టమే.. శ్వేతపత్రంపై చర్చలో పాల్గొనేదెవరు?

బీఆర్ఎస్ శాసనసభా పక్ష పార్టీకి డిప్యూటీ లీడర్‌గా ఎవరిని నియమించాలనే దానిపై కేసీఆర్ మల్లగుల్లాలు పడుతున్నట్టు తెలుస్తున్నది.

Update: 2023-12-19 02:10 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్ శాసనసభా పక్ష పార్టీకి డిప్యూటీ లీడర్‌గా ఎవరిని నియమించాలనే దానిపై కేసీఆర్ మల్లగుల్లాలు పడుతున్నట్టు తెలుస్తున్నది. ఆనారోగ్య కారణంగా ఆయన ప్రస్తుత అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావడంలేదు. ఈ నేపథ్యంలో డిప్యూటీ లీడర్‌ నియామకంపై ఆరా తీస్తున్నట్టు ప్రచారం జరుగుతున్నది. అయితే హరీశ్, కేటీఆర్‌ను కాదని మరో ఎమ్మెల్యేకు ఆ బాధ్యతలు అప్పగిస్తే రాజకీయంగా ఏ మేరకు ప్రయోజనం ఉంటుందనే కోణంలోనూ ఆలోచిస్తున్నారు.

అల్లుడు, కొడుకులకు బాధ్యతలు

ఈ నెల 21న అసెంబ్లీలో రాష్ట్ర అర్థిక పరిస్థితిపై ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయనుంది. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో చేసిన​అప్పులు, పెట్టిన ఖర్చుల వివరాలను వెల్లడించనుంది. కేసీఆర్ బదులుగా మాజీ మంత్రులు హరీశ్, కేటీఆ‌ర్‌లకు బాధ్యతలు అప్పగించినట్టు తెలుస్తున్నది. హరీశ్ తమ పాలనలో ఉన్న ఆర్థిక పరిస్థితులపై ఆధ్యయనం చేస్తున్నట్టు తెలిసింది.

Tags:    

Similar News