లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి 200 సీట్లు కూడా రావు: KCR
పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ కూటమికి 200 సీట్లు కూడా రావని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ విమర్శించారు.
దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ కూటమికి 200 సీట్లు కూడా రావని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం కామారెడ్డిలో కేసీఆర్ రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పదేళ్లుగా తెలంగాణకు తీవ్ర అన్యాయం చేసిన మోడీకి బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. పదేళ్లలో తెలంగాణకు మోడీ ఇచ్చింది గుండు సున్నా అని విమర్శించారు. కేంద్రంలో మళ్లీ బీజేపీ గెలిస్తే పెట్రోల్, డీజిల్ ధరలు 400 అవుతాయని కేసీఆర్ అన్నారు. ఇందులో అనుమానమే అవసరమే లేదని స్పష్టం చేశారు.
ఈ ఎన్నికల్లో ఆలోచించి ఓటు వేయాలని యువతకు విజ్ఞప్తి చేశారు. ఈసారి కేంద్రంలో రాబోయేది సంకీర్ణ ప్రభుత్వమే అని తెలిపారు. కామారెడ్డి జిల్లా చాలా చైతన్యం ఉన్న గడ్డ.. తెలంగాణ ఉద్యమంలో బ్రహ్మాండమైన పోరాటం చేసిన గడ్డ అని కేసీఆర్ పేర్కొన్నారు. ఇదే కామారెడ్డి పట్టణంలో పోలీసు కిష్టయ్య పిస్టోల్‌తో కాల్చుకుని అమరుడయ్యారని గుర్తు చేశారు. సాధించిన తెలంగాణను పదేళ్లలో అద్భుతంగా పనిచేశామని అన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో పరిశ్రమలు, ఐటీ రంగంలో విశేష కృషి చేసి బ్రహ్మాండమైన పెట్టుబడులు తెచ్చామని చెప్పారు.
Read More...
బీఆర్ఎస్ చాలా వీక్‌గా ఉంది.. బీజేపీ, కాంగ్రెస్ మధ్యే పోటీ: బీజేపీ స్టార్ క్యాంపెయినర్ తమిళిసై