BREAKING : యూట్యూబర్ ప్రణీత్‌కు 14 రోజుల రిమాండ్

తండ్రీకూతుళ్ల బంధంపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన కేసులో యూట్యూబర్ ప్రణీత్ హనుమంతుకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్‌ను నాంపల్లి కోర్టు విధించింది.

Update: 2024-07-11 11:40 GMT

దిశ, వెబ్‌డెస్క్: తండ్రీకూతుళ్ల బంధంపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన కేసులో యూట్యూబర్ ప్రణీత్ హనుమంతుకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్‌ను నాంపల్లి కోర్టు విధించింది. కాగా, బుధవారం బెంగళూరులో ప్రణీత్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రణీత్‌తో పాటు మరో ముగ్గురు నిందితులకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ప్రణీత్‌పై 67 బీ ఐటీ, పోక్సో, 79, 294 బీఎన్ఎస్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు బెంగళూరు ప్రణీత్ అదుపులోకి తీసుకోగా.. ట్రాన్సిట్ వారెంట్ ద్వారా ప్రణీత్‌ను హైదరాబాద్ తీసుకువచ్చి నాంపల్లి కోర్టులో హాజరుపర్చారు.


Similar News