BREAKING: శ్రీరామ నవమి రోజు రామబాణం వేస్తే తప్పేంటి: అసదుద్దీన్‌పై మాధవీ లత ఫైర్

లోక్‌సభ ఎన్నికల ప్రచారం రాష్ట్ర వ్యాప్తంగా ఎలా ఉన్నా.. హైదరాబాద్‌లో మాత్రం కాక రేపుతోంది.

Update: 2024-04-22 17:22 GMT

దిశ, వెబ్‌డెస్క్: లోక్‌సభ ఎన్నికల ప్రచారం రాష్ట్ర వ్యాప్తంగా ఎలా ఉన్నా.. హైదరాబాద్‌లో మాత్రం కాక రేపుతోంది. ప్రధాన ప్రత్యర్థులైన ఎంఐఎం, బీజేపీ అభ్యర్థుల మధ్య ఓ రేంజ్‌లో డైలాగ్ వార్ నడుస్తోంది. ఏళ్ల తరబడి హైదరాబాద్ ఎంపీ స్థానంపై తిష్ట వేసిన అసదుద్దీన్‌ను ఎలాగైనా.. మట్టికరిపించేందుకు బీజేపీ అధిష్టానం పకడ్బందీగా ప్లాన్ చేస్తోంది. ఈ మేరకు ఇప్పటికే ఆ నియోజకవర్గ పరిధిలో ఉన్న దొంగ ఓట్లను కూడా తొలగించేసింది. ఈ నేపథ్యంలోనే బీజేపీ అభ్యర్థి మాధవీ లత చేసిన ఓ పని పార్టీకి కాస్త ఇబ్బందులు తెచ్చి పెట్టింది. ఇటీవలే ఓ ర్యాలీలో మసీదును లక్ష్యంగా చేసుకుని అభ్యర్థి మాధవీ లత రాముడు బాణాన్ని సంధిస్తున్నట్లుగా అనుకరించారు.

దీంతో అసద్దుద్దీన్ ప్రెస్ మీట్ పెట్టి ఆమెపై తీవ్ర ఆరోపణ చేస్తూ విరుచుకుపడ్డారు. మాధవీ లత ముస్లీంలను అవమానిస్తున్నారని ఆరోపించారు. అయితే, ఆ వ్యాఖ్యలపై ఇవాళ ఆమె స్పందించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. శ్రీరామ నవమి రోజు బాణం వేస్తే తప్పేంటని అసదుద్దీన్‌ని ప్రశ్నించారు. అసలు ఆ వీడియోను తప్పుగా తీశారని.. కావాలనే మసీదు వైపు తిప్పారని తెలిపారు. కావాలనే తన ప్రత్యర్థి అసదుద్దీన్, ప్రభుత్వం అండతో తనపై తప్పుడు కేసులు పెట్టిస్తున్నారని ఆరోపించారు. తాను ముమ్మాటికీ ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించలేదని అన్నారు. బీఫ్ గురించి మాట్లాడి మతాల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తోంది అసద్దుద్దీనే అని అన్నారు. తనకు బీఫాం ఆపారన్నది పూర్తిగా అవాస్తవమని మాధవీ లత స్పష్టం చేశారు.

Tags:    

Similar News