BREAKING: ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించిన విద్యుత్ ఉద్యోగి.. ఈసీ సీరియస్ యాక్షన్

లోక్‌సభ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడిన నాటి నుంచి దేశ వ్యా్ప్తంగా ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చింది.

Update: 2024-04-23 10:43 GMT

దిశ, వెబ్‌డెస్క్: లోక్‌సభ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడిన నాటి నుంచి దేశ వ్యా్ప్తంగా ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చింది. ఇప్పటి ప్రధాన పార్టీల నేతలు ప్రచారంలో ముమ్మరంగా పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే ప్రసంగాల్లో నోరుజారిన నేతలపై ఈసీ కొరడా ఝుళిపిస్తోంది. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులై ఉండి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్న పలువురు ఉద్యోగులపైనా ఈసీ ఫోకస్ పెట్టింది. తాజాగా, కరీంనగర్ జిల్లాలో ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించిన విద్యుత్ సంస్థ ఉద్యోగి తులసిని విధుల నుంచి సస్పెండ్ చేసింది. ఈ మేరకు ఆమెను విధుల నుంచి తొలగిస్తూ.. డీఈ కాళిదాసు ఇవాళ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే, ఎన్నికల కమిషన్ నియమ నిబంధనలను ఉల్లంఘించిన ఉద్యోగి తులసి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొంది. దీంతో అమెపై ఈసీ సస్పెస్షన్ వేటు వేసింది.

Tags:    

Similar News