BREAKING: ఉత్తమ్..! నీ బెదిరింపులకు భయడేది లేదు: ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్

రాష్ట్రంలోని పౌర సరఫరాల శాఖలో రూ.వెయ్యి కోట్లు అవినీతి జరిగిందంటూ సంబంధిత శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డిపై బీజేపీ ఎమ్మెల్యే ఆలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపణలు గుప్పించారు.

Update: 2024-05-27 07:17 GMT

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలోని పౌర సరఫరాల శాఖలో రూ.వెయ్యి కోట్లు అవినీతి జరిగిందంటూ సంబంధిత శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డిపై బీజేపీ ఎమ్మెల్యే ఆలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపణలు గుప్పించారు. అందుకు సమాధానంగా మంత్రి ఉత్తమ్ ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు. మహేశ్వర్‌రెడ్డి పచ్చి అబద్ధాలు చెబుతున్నాడని ఫైర్ అయ్యారు. ధాన్యం కొనుగోలు అంటే.. డబ్బులిచ్చి ఫ్లోర్ లీడర్ పదవి కొనుక్కున్నంత ఈజీ కాదని ధ్వజమెత్తారు. ఈ నేపథ్యంలోనే ఉత్తమ్ వ్యాఖ్యలకు ఇవాళ ఏలేటి మరోసారి మీడియా ముందుకొచ్చి కౌంటర్ ఇచ్చారు. హైదరాబాద్‌లోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. తన పొలిటికల్ కెరీర్‌లో ఎవరినీ వ్యక్తిగతంగా విమర్శించ లేదని అన్నారు. అయినా బెదరింపులకు ఏ మాత్రం భయపడేది లేదని స్పష్టం చేశారు. తాను ఉత్తమ్ శాఖలో జరిగిన అవినీతిని మాత్రమే బయటపెట్టానని, ఆయన వ్యక్తిగతంగా మాట్లాడితే సహించేది లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా.. అదే స్పీడ్‌తో పని చేశానని, ఇప్పుడు బీజేపీ శాసనసభా పక్ష నేతగా అదే పని చేస్తున్నానని అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిపైనే తన పోరాటమని.. ఎవరిపైనో వ్యక్తిగతంగా కాదని తెలిపారు. ఆయన శాఖలో జరిగిన అవినీతి గురించి మాట్లాడితే పర్సనల్ తీసుకోవద్దని.. ఒకవేళ తాను కూడా వ్యక్తిగతంగా తీసుకుంటే ఉత్తమ్ చాలా నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. ఏది ఏమైనా.. సవిల్ సప్లైస్ అవకతవకలపై సీబీఐ విచారణ జరపాలని, ఇదే విషయంపై కేంద్రానికి త్వరలోనే ఫిర్యాదు చేస్తామని ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు.

Tags:    

Similar News