BREAKING: సమ్మక్క, సారలమ్మను దర్శించుకున్న కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి.. గిరిజన రిజర్వేషన్లపై కీలక వ్యాఖ్యలు

సమ్మక్క, సారలమ్మ జాతర సందర్భంగా ఇవాళ అమ్మవార్లను రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి దర్శించుకున్నారు.

Update: 2024-02-22 09:14 GMT

దిశ, వెబ్‌డెస్క్: సమ్మక్క, సారలమ్మ జాతర సందర్భంగా ఇవాళ అమ్మవార్లను రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి దర్శించుకున్నారు. అనంతరం నిలువెత్తు బంగారాన్ని సమర్పించి మొక్కు తీర్చుకున్నారు. అంతకు ముందు ములుగు జిల్లాలో పర్యటించిన ఆయన గిరిజన ఆరాధ్య దైవం గట్టమ్మ ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కేంద్రీయ విశ్వ విద్యాలయానికి ఎంపిక చేసిన స్థలాన్ని కూడా అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మరోసారి బీజేపీ అధికారంలోకి రాగానే దేశ వ్యాప్తంగా గిరిజన రిజర్వేషన్లు అమలు చేస్తామని పేర్కొన్నారు. ములుగులో గిరిజన వర్సిటీ తాత్కలిక క్యాంపస్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. వర్సిటీలో ఎక్కువ సీట్లు తెలంగాణ విద్యార్థులకు కేటాయించేలా చూస్తామని పేర్కొన్నారు. మేడారం జాతరను జాతీయ పండుగగా నిర్వహించాలన్న డిమాండ్‌ను కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోందని కిషన్‌రెడ్డి తెలిపారు. 

Tags:    

Similar News