BREAKING: కాంగ్రెస్ మేనిఫెస్టోపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సెటైర్లు.. నోట్లు ముద్రించి ఇస్తారేమో అని వ్యాఖ్యలు
కేంద్రంలో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ సార్వత్రిక ఎన్నికల మేనిఫెస్టోను శుక్రవారం ఢిల్లీలో విడుదల చేసింది.
దిశ, వెబ్‌డెస్క్: కేంద్రంలో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను శుక్రవారం ఢిల్లీలో విడుదల చేసింది. మేనిఫెస్టోను ఏఐసీసీ చీఫ్ ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ విడుదల చేశారు. న్యాయ్ పత్ర -2024 పేరుతో కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోను ఆవిష్కరించారు. అందులో సామాజిక సంక్షేమ పథకాలతో పాటు 25 గ్యారంటీలను పొందుపరిచారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి కాంగ్రెస్ మేనిఫెస్టోపై ఓ రేంజ్‌లో సెట్లైర్లు వేశారు.
ప్రతి మహిళకు రూ.లక్ష ఇస్తామని చెప్పిన హమీపై కౌంటర్ అటాక్ చేశారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల్లో నోట్లు ముద్రించి ఇస్తామరేమో అంటూ ఎద్దేవా చేశారు. తెలంగాణలో తప్పడు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. మళ్లీ స్ట్రాటజీతో, ఆచరణ సాధ్యం కానీ హామీలు గుప్పించి అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ముందు రాష్ట్రంలో ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు చేయాలని ధ్వజమెత్తారు. హామీలు అమలు చేయకుండా ఓటు అడిగే నైతిక హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదని కిషన్‌రెడ్డి హితవు పలికారు.