బ్రేకింగ్: TPCC చీఫ్ రేవంత్ రెడ్డి హౌస్ అరెస్ట్

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.

Update: 2023-01-02 02:33 GMT

దిశ, వెబ్‌డెస్క్: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. రాష్ట్రంలోని సర్పంచ్‌ల సమస్యలపై ధర్నాచౌక్ వద్ద ఇవాళ కాంగ్రెస్ ఆందోళనకు పిలుపునిచ్చిన నేపథ్యంలో.. ముందుగానే రేవంత్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేసి నిర్భందించారు. ధర్నాకు వెళ్లకుండా ముందస్తుగానే హౌస్ అరెస్ట్ చేయడంపై రేవంత్ రెడ్డి మండిపడుతున్నారు. పోలీసులు, ప్రభుత్వ తీరుపై ఫైర్ అయిన రేవంత్ రెడ్డి.. ఎలాగైనా ధర్నా చేసి తీరుతామని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. ధర్నాచౌక్ వద్ద టీ-కాంగ్రెస్ పిలుపునిచ్చిన ధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించారు. పోలీసులు పర్మిషన్ ఇవ్వకపోయినా ధర్నా చేసి తీరుతామని కాంగ్రెస్ నేతలు ప్రకటించారు. దీంతో పోలీసులు ముందస్తుగానే పలువురు కాంగ్రెస్ నేతలను హౌస్ అరెస్ట్ చేస్తున్నారు.


Similar News