Breaking: ఇది నిజంగా హృదయవిదారకమే.. భావోద్వేగంతో కేటీఆర్ సంచలన ట్వీట్
కళ్లెదుటే తండ్రిని ప్రత్యర్థులు కొడుతుండగా.. చూసి తట్టుకోలేక 14 ఏళ్ల కూతురు ప్రాణాలు విడిచిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.
దిశ, వెబ్‌డెస్క్: కళ్లెదుటే తండ్రిని ప్రత్యర్థులు కొడుతుండగా.. చూసి తట్టుకోలేక 14 ఏళ్ల కూతురు ప్రాణాలు విడిచిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. సూర్యాపేట జిల్లా నాగారం మండల పరిధిలోని డీ కొత్తపల్లి గ్రామానికి చెందిన కాసం సోమయ్యతో అదే గ్రామానికి చెందిన కడారి సైదులు, కడారి సోమయ్య, కాసం కళింగంతో భూ తగాదాలున్నాయి. ఈ క్రమంలో గురువారం రాత్రి 10 గంటల సమయంలో సోమయ్య ఇంటికి వచ్చిన ప్రత్యర్థులు సైదులు, కళింగం కర్రలు, ఇనుపరాడ్లతో ఆయనపై విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ క్రమంలో సోమయ్య కాలు విరగ్గా.. అడ్డు వెళ్లిన భార్య తలకు తీవ్ర గాయాలయ్యాయి. అయితే, దాడిని ప్రత్యక్షంగా చూసిన సోమయ్య కూతురు కూతురు పావని(14) ‘మా నాన్నా.. వదలండి’ అంటూ గుండెల అవిసేలా రోదించి స్పృహతప్పి కుప్పకూలింది. అనంతరం కుటుంబసభ్యులు వెళ్లి చూడగా ప్రాణాలు విడిచింది.
ఈ క్రమంలోనే జరిగిన ఘటనపై మాజీ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ‘నిజంగా హృదయవిదారకమే..! గూండాలు ఇంట్లోకి ప్రవేశించి ఆమె తండ్రి సోమయ్యపై దాడి చేయడంతో 14 ఏళ్ల పల్లవి గుండె ఆగిపోయింది. ఆమె సాయం కోసం రోదించింది. తన ప్రియమైన తండ్రిపై ప్రత్యర్థుల దాడిని చూసి తట్టుకోలేక పల్లవి కుప్పకూలి ప్రాణాలు విడిచింది. ప్రేమ గల కూతురికి తండ్రిగా.. ఒక చిన్న అమ్మాయిని.. తండ్రి హృదయం ఉన్న చిన్న అమ్మాయిని రక్షించడంలో విఫలమైనందుకు నాకు బాధగా ఉంది! ఆ కుటుంబానికి, ముఖ్యంగా తండ్రికి ప్రగాఢ సానుభూతి. ప్రభుత్వంపై మరో పెద్ద మచ్చ, తెలంగాణలో శాంతిభద్రతలు క్షీణిస్తున్నందుకు హృదయ విదారక ఉదాహరణ. క్షమించండి పల్లవి మేము నిన్ను కాపాడుకోవడంలో విఫలం అయ్యాం’ అంటూ సంచలన ట్వీట్ చేశారు.