BREAKING : తెలంగాణలో గ్రూప్-2 వాయిదా

తెలంగాణలో గ్రూప్-2ప్రభుత్వం వాయిదా వేసింది.

Update: 2024-07-19 09:00 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఆగస్టులో నిర్వహించాల్సిన గ్రూప్-2 పరీక్షను తెలంగాణ ప్రభుత్వం వాయిదా వేసింది. రాష్ట్రంలో గ్రూప్-2 పరీక్షను డిసెంబర్‌కు వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వం శుక్రవారం  ప్రకటించింది. డీఎస్సీ కారణంగా వాయిదా వేయాలని గత కొన్ని రోజులుగా నిరుద్యోగులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. 783 గ్రూప్ 2 పోస్టుల భర్తీకి 2022 డిసెంబర్‌లో టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. గత ప్రభుత్వ హయాంలో వివిధ కారణాలతో మూడు సార్లు గ్రూప్-2 వాయిదా పడగా.. ఈ ఏడాది ఆగస్టు 7,8 తేదీల్లో గ్రూప్-2 పరీక్ష నిర్వహించాల్సి ఉంది. మరోసారి  గ్రూప్-2 వాయిదా పడటంతో మొత్తం నాలుగు సార్లు ఈ పరీక్ష వాయిదా పడినట్లు అయింది. మొత్తం 18 విభాగాల్లో 783 పోస్టులకు రాష్ట్ర వ్యాప్తంగా 5,51,943 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. 2023 జనవరి 18 నుంచి ఫిబ్రవరి 16 వరకు దరఖాస్తులను స్వీకరించారు. కాగా, ప్రభుత్వ తాజా నిర్ణయంతో గ్రూప్-2 పరీక్షలు ఈ ఏడాది డిసెంబర్‌లో జరగనున్నాయి. 

Tags:    

Similar News