దిశ, వెబ్‌డెస్క్: ఐఏఎస్ స్మితా సబర్వాల్‌కు హైకోర్టులో భారీ ఊరట లభించింది. దివ్యాంగులను కించపరిచేలా ఆమె వ్యాఖ్యలు చేశారని స్మితా సబర్వాల్‌పై చర్యలు కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. తాజాగా హైకోర్టు విచారణకు అర్హతలేదని పిటిషన్ కొట్టివేసింది. వికలాంగుల కోటా అవసరమా అంటూ స్మితా సబర్వాల్ చేసిన వ్యాఖ్యలు ఇటీవల దుమారం రేపిన విషయం తెలిసిందే. దీంతో ఐఏఎస్ పై తీవ్ర విమర్శలు వచ్చాయి. అలా మాట్లాడటం ఏమాత్రం సరైంది కాదని పలువురు పొలిటిషీయన్స్ తప్పుబట్టారు. స్మితా సబర్వాల్‌పై వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ పై నేడు (సోమవారం) కోర్టు విచారణ జరిపి.. పిటిషన్ కొట్టివేసింది. దీంతో ఐఏస్ స్మితా సబర్వాల్ కు భారీ ఊరట కలిగింది.