BREAKING: అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఉక్కుపాదం.. భారీ భవనం నేలమట్టం
ప్రభుత్వ ఆస్తులు, స్థలాలు, చెరువులు, కుంటలు, పార్క్ స్థలాలు, బఫర్ జోన్ల పరిరక్షణే ధ్యేయంగా ప్రభుత్వం హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీకి (హైడ్రా)కు అంకురార్పణ చేసింది.
దిశ, వెబ్‌డెస్క్: ప్రభుత్వ ఆస్తులు, స్థలాలు, చెరువులు, కుంటలు, పార్క్ స్థలాలు, బఫర్ జోన్ల పరిరక్షణే ధ్యేయంగా ప్రభుత్వం హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీకి (హైడ్రా)కు అంకురార్పణ చేసింది. ఈ సంస్థకు చైర్మన్ స్వయంగా సీఎం రేవంత్‌రెడ్డి చైర్మన్‌గా వ్యవహరిస్తుండగా.. కమిషనర్‌గా సీనియర్ ఐపీఎస్ రంగనాథ్‌ను సర్కార్ నియమించింది. దీంతో రంగంలోకి దిగిన హైడ్రా అప్పుడే అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. ప్రభుత్వం భూములను కబ్జా చేయాలనే ఆలోచన రాకుండా చేసేందుకు ఆ సంస్థ నేరుగా యాక్షన్‌లోకి ఎంటరైంది. ఈ క్రమంలోనే ఇవాళ తెల్లవారుజామున నిబంధనలకు విరుద్ధంగా మేడ్చల్ జిల్లా బాచుపల్లి ఎర్రకుంటలో నిర్మాణంలో బహుళ అంతస్థుల బిల్డింగ్‌ను అధికారులు నేలమట్టం చేశారు. హైడ్రా కమిషనర్ రంగానాథ్ ఆదేశాల మేరకు చర్యలు తీసుకున్నట్లుగా అధికారులు పేర్కొన్నారు.