BREAKING: సోనియా గాంధీకి అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ లేఖ.. సొంత పార్టీ నేతలపై ఆరోపణలు
లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్ర కాంగ్రెస్‌లో మరో సంచలన పరిణామం చోటుచేసుకుంది.
దిశ, వెబ్‌డెస్క్: లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్ర కాంగ్రెస్‌లో మరో సంచలన పరిణామం చోటుచేసుకుంది. నాగర్ కర్నూల్ ఎంపీ టికెట్ మల్లు రవి కేటాయించారంటూ ప్రచారం జరుగుతుండటంతో అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి ఇవాళ లేఖ రాశారు. నాగర్ కర్నూల్ టికెట్ తనకే కేటాయించాలంటూ సోనియాకు విజ్క్షప్తి చేశారు. కాంగ్రెస్‌లోనే కొందరకు నేతలు తనపై తప్పుడు నివేదికలను ఇచ్చారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తన ఎదుగుదల పార్టీలో కొందరికి ఇష్టం లేదని తెలిపారు. పార్టీ గెలుపు కోసం తాను అహర్నిశలు కష్టపడ్డానంటూ లేఖలో పేర్కొన్నారు.