BREAKING: నేడు నగరానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాక.. స్వాగతం పలకనున్న సీఎం రేవంత్
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేడు నగరానికి రానున్నారు. ఈ మేరకు ఆమెకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వగతం పలుకనున్నారు.
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేడు నగరానికి రానున్నారు. ఈ మేరకు ఆమెకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వగతం పలుకనున్నారు. మార్చి 15న నగర శివార్లలోని ఆశ్రమంలో మూడు రోజుల పాటు అట్టహాసంగా నిర్వహించే గ్లోబల్ స్పిరిచ్యువల్ మహోత్సవాన్ని ఆమె ప్రారంభించనున్నారు. ఈ క్రమంలో రాష్ట్రపతి పర్యటనకు సంబంధించి జరుగుతున్న ఏర్పాట్లను సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎ.శాంతికుమారి సచివాలయంలో ఉన్నతాధికారులతో సమీక్షించారు. గ్లోబల్ స్పిరిచ్యువల్ మహోత్సవానికి ప్రపంచం నలుమూలల నుంచి 75 వేల మంది ప్రతినిధులు హాజరవుతారు.
ముగింపు రోజున ప్రముఖ ఆధ్యాత్మిక గురువులు సమావేశాల్లో పాల్గొననున్నారు. ఈ మేరకు ముందస్తుగా అన్ని ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధికారులను ఆదేశించారు. తగిన భద్రతా ఏర్పాట్లు చేయాలని పోలీసు శాఖను ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా బేగంపేట విమానాశ్రయం, రాజ్ భవన్, అన్ని వేదికల వద్ద తగినన్ని అగ్నిమాపక ఏర్పాట్లు చేయాలని సూచించారు. రాష్ట్రపతి కార్యాలయ అవసరాల మేరకు వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు సహాయక సిబ్బందితో పాటు మహిళా వైద్యుల సేవలను అందుబాటులో ఉండాలని సూచించారు.