BREAKING: మహిళలపై దాడులు జరుగుతున్నా సీఎం స్పందించడా: మాజీ మంత్రి సబిత ఫైర్

మహిళలపై దాడులు జరుగుతున్నా సీఎం రేవంత్‌రెడ్డి స్పందించడా అని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రశ్నించారు.

Update: 2024-09-06 05:44 GMT

దిశ, వెబ్‌డెస్క్: మహిళలపై దాడులు జరుగుతున్నా సీఎం రేవంత్‌రెడ్డి స్పందించడా అని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రశ్నించారు. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలో ఆటో డ్రైవర్ దాడిలో గాయపడిన మహిళను పరామర్శించేందుకు ఇవాళ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందం గాంధీ ఆసుపత్రికి వెళ్లారు. ఈ సందర్భంగా మాజీ సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో మహిళలకు ఏ మాత్రం రక్షణ లేకుండా పోయిందని ఆరోపించారు. వరుసగా రాష్ట్రంలో మహిళపై దాడులు జరుగుతున్నా సీఎం రేవంత్‌రెడ్డి ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. 8 నెలల్లో మహిళలపై 1,800 పైగా అత్యాచారాలు, అఘాయిత్యాలు జరిగాయని వాటన్నింటిని ప్రభుత్వం చూసీచూడనట్లుగా వ్యవహరిస్తోందని ఆక్షేపించారు. మహిళలంటే ఓ చులకనభావంగా పరిపాలన కొనసాగుతోందని అన్నారు. జైనూరు ఘటన చాలా బాధాకరమని అన్నారు. మహిళపై దారుణంగా దాడికి పాల్పడిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని ఆమె డిమాండ్ చేశారు. 


Similar News