BREAKING: బీజేపీ మేనిఫెస్టో విడుదల.. సీఎం రేవంత్‌రెడ్డి రియాక్షన్ ఇదే..!

రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ముచ్చటగా మూడోసారి అధికారంలో వచ్చేందుకు కేంద్రంలో బీజేపీ ఇప్పటికే ప్రచార పర్వాన్ని ప్రారంభించింది.

Update: 2024-04-14 10:24 GMT

దిశ, వెబ్‌డెస్క్: రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ముచ్చటగా మూడోసారి అధికారంలో వచ్చేందుకు కేంద్రంలో బీజేపీ ఇప్పటికే ప్రచార పర్వాన్ని ప్రారంభించింది. ఈ నేపథ్యంలో ఆ పార్టీ ఢిల్లీ‌లో పార్టీ మేనిఫెస్టోను విడుదల చేసింది. ప్రధాని మోడీ చేతుల మీదుగా విడుదల చేసిన ఈ మేనిఫెస్టోకు ‘సంకల్ప్ పత్ర’గా నామకరణం చేశారు. అదేవిధంగా ప్రధాని మోడీ హామీ పేరుతో 14 కీలక అంశాలను మేనిఫెస్టోలో బీజేపీ పొందుపరిచింది. ఈ క్రమంలోనే కమలనాథుల మేనిఫెస్టో‌పై తెలంగాణ సీఎం రేవంత్‌‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ మేనిఫెస్టో కాలం చెల్లిన చెక్కులాంటిదని ఎద్దేవా చేశారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ప్రజలు ఖచ్చితంగా తిరస్కరిస్తారని అన్నారు. ప్రజలు ఏం చేస్తామో చెప్పకుండా ఆ పార్టీ ఎన్నికల రణరంగంలోకి దిగుతోందని ఆరోపించారు. రాహుల్ నేతృత్వంలోని కాంగ్రస్ ప్రజల కష్టాలను తీర్చేందుకు ప్రయత్నిస్తోందని అన్నారు. దేశంలో 2004 చరిత్ర పునరావృతం కాబోతోందని అన్నారు. ఈ సారి కేంద్రంలో బీజేపీ ఓడిపోవడం ఖాయమని అన్నారు. ఏది ఏమైనా ఈసారి కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం పక్కా అని స్పష్టం చేశారు.

Tags:    

Similar News