BREAKING: శ్రీవారిని దర్శించుకున్న బండి సంజయ్.. ఏపీలో గత ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు
పుట్టిన రోజు సందర్భంగా గురువారం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శనంలో తిరుమల శ్రీవారి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ దర్శించుకున్నారు.
దిశ, వెబ్‌డెస్క్: తన పుట్టిన రోజు సందర్భంగా గురువారం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శనంలో తిరుమల శ్రీవారి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ వేద పండితులు ఆయనకు ఆశీర్వచనం ఇచ్చి తీర్ధ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయం వెలుపలికి వచ్చిన ఆయన ఏపీలో గత ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుమలలో శ్రీవారి ఆస్తులకు పంగనామాలు పెట్టిన నయ వంచకులు పోయారంటూ హాట్ కామెంట్స్ చేశారు. ఎర్రచందనం పేరుతో జాతీయ సంపదను పూర్తిగా కొల్లగొట్టారంటూ ఫైర్ అయ్యారు. దేవుడి ఆస్తులపై పడి తింటే ఏ పార్టీకైనా అలాంటి గతే పడుతుందని ధ్వజమెత్తారు. రాజకీయ నిరుద్యోగులకు టీటీడీ పునరావాస కేంద్రంగా మారిందని ఆయన ఫైర్ అయ్యారు. ముఖ్యంగా ఎర్రచదనం దొంగలను వదిలిపెట్టే ప్రసక్తే లేదని అన్నారు. ప్రస్తుతం స్వామి వారికి నిత్యం చేసే రాజ్యం వచ్చిందని బండి సంజయ్ అన్నారు.