BREAKING : ఈ నెల 23 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

ఈ నెల 23 నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి.

Update: 2024-07-18 08:58 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఈ నెల 23 నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. ఈ నెల 24 నుంచి శాసనమండలి సమావేశాలు జరగనున్నాయి. ఈ మేరకు అసెంబ్లీ, కౌన్సిల్ సమావేశాలకు నోటిఫికేషన్‌ను గవర్నర్ సీపీ. రాధాకృష్ణన్ జారీ చేశారు. 23న ఉదయం 11 గంటలకు అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగించనున్నారు. 24 ఉదయం 10 గంటలకు కౌన్సిల్ సమావేశం నిర్వహించనున్నారు. గతంలో బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాలేదు. మరి ఈ సారి జరిగే అసెంబ్లీ సెషన్‌కు గులాబీ బాస్ హాజరుపై ఉత్కంఠ నెలకొంది.

బడ్జెట్‌తో పాటు జాబ్ క్యాలెండర్‌పై ప్రకటన ఉండే అవకాశం ఉన్నట్లు సమాచారం. రైతు భరోసా గైడ్స్ లైన్స్ కోసం మంత్రి వర్గ ఉపసంఘం జిల్లాల్లో పర్యటిస్తున్నందున ఈ కమిటీ రిపోర్టుపై అసెంబ్లీలో చర్చించే చాన్స్ ఉంది. పార్టీ ఫిరాయింపుల అంశంపై బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున ఆందోళనలు చేసే చాన్స్ ఉంది. మరో వైపు కాంగ్రెస్ సర్కారు అసెంబ్లీ సమావేశాల నాటికి మరికొంత మంది ఎమ్మెల్యేలకు హస్తం పార్టీ కండువా కప్పేందుకు వ్యూహాలు రచిస్తోంది. కాగా, అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌కు సీపీఐ ఒక సీటుతో కలిపి 65 మంది ఎమ్మెల్యేల బలంగా ఉండగా.. ప్రస్తుతం ఆ బలం 76కు చేరింది. పది మంది కాంగ్రెస్ కండువా కప్పుకోగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచిన విషయం తెలిసిందే.

Tags:    

Similar News