Breaking: తెలంగాణకు భారీ విరాళం ప్రకటించిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్..

గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, వరదలు తెలుగు రాష్ట్రాలకు విషాదాన్ని మిగిల్చాయి.

Update: 2024-09-04 09:37 GMT

దిశ, వెబ్‌డెస్క్: గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, వరదలు తెలుగు రాష్ట్రాలకు విషాదాన్ని మిగిల్చాయి. ఇక రెండు తెలుగు రాష్ట్రాలకు సినీ, రాజకీయ ప్రముఖులు విరాళాలు ప్రకటిస్తున్నారు. అందులో భాగంగా ఇప్పటికే ఏపీకి కోటి ప్రకటించిన పవన్ కళ్యాణ్( Pawan Kalyan).. తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా నష్టపోయిన బాధితులకు భారీ విరాళాన్ని (Donations) ప్రకటించారు. తెలంగాణకు రూ. కోటిని సీఎంకు స్వయాన అందజేస్తానని తెలిపారు. కష్టాలు వచ్చినప్పుడు ఒకరికొకరు అండగా నిలబడాలని విజ్ఞప్తి చేశారు. వైసీపీ నాయకులు కూడా విరాళాలు ఇవ్వాలన్నారు.

Also Read: Pawan Kalyan: ‘హైడ్రా’పై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ ప్రశంసలు.. సీఎం రేవంత్ మంచి పని చేశారని కితాబు


Similar News