BREAKING: లోక్‌సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్‌కు మరో ఝలక్.. కాంగ్రెస్‌లో చేరిన గుత్తా అమిత్‌రెడ్డి
లోక్‌సభ ఎన్నికల వేళ రాష్ట్ర రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.
దిశ, వెబ్‌డెస్క్: లోక్‌సభ ఎన్నికల వేళ రాష్ట్ర రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ సీనియర్ నేత, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తనయుడు గుత్తా అమిత్‌రెడ్డిని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి ఆయన నివాసంలో అమిత్ రెడ్డికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాగా, ఇవాళ ఉదయం అమిత్‌రెడ్డి నివాసానికి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరీ, డీసీసీ అధ్యక్షులు రోహిన్‌రెడ్డి వెళ్లారు. ఈ మేరకు వారు అమిత్‌రెడ్డిని కాంగ్రెస్‌లో చేరాలని ఆహ్వానించగా వారి ఆహ్వానం మేరకు ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు ప్రకటించారు.
కాగా, పోయిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి మునుగోడు టికెట్ ఆశించిని అమిత్‌రెడ్డికి నిరాశే ఎదురైంది. దీంతో ఆయన కాంగ్రెస్ చేరి అదే స్థానం నుంచి బరిలో నిలవాలని అనుకున్నారు. కానీ, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రీఎంట్రీతో ఆయనకు టికెట్ దక్కకుండా పోయింది. దీంతో ఆయన అప్పటి నుంచి బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలకు, సభలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఇటీవలే ఆయన తండ్రి తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. అర్థం లేని రాజకీయాలే బీఆర్ఎస్‌ను కొంపముంచాయని, బీఎస్పీ మాదిరిగానే బీఆర్ఎస్ తయారైందంటూ ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు. సొంత పార్టీలోనే లీల్లిపుట్లను కేసీఆర్ తయారు చేశాడని బహిరంగానే విమర్శించారు. పార్టీ నేతల అహంకారంతోనే బీఆర్ఎస్ అధికారంతో పాటు ప్రజలకు దూరమైందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో అమిత్‌రెడ్డితో పాటు సుఖేందర్ రెడ్డి కూడా కాంగ్రెస్‌లో చేరుతాడా.. బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటారా అనేది ఆసక్తికరంగా మారింది.