‘విమానంలో బాంబు ఉంది.. పారిపోండి..’ బెదిరింపు మెయిల్‌తో కలకలం
శంషాబాద్ విమానాశ్రయంలో బాంబు ఉందంటూ థ్రెటెనింగ్ మెయిల్స్ రావడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. ఎయిర్‌పోర్ట్ అధికారులు వెంటనే అలెర్ట్ అయి ఎయిర్‌పోర్ట్ మొత్తం బాంబు కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
దిశ, వెబ్‌డెస్క్: శంషాబాద్ విమానాశ్రయంలో బాంబు ఉందంటూ థ్రెటెనింగ్ మెయిల్స్ రావడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. ఎయిర్‌పోర్ట్ అధికారులు వెంటనే అలెర్ట్ అయి ఎయిర్‌పోర్ట్ మొత్తం బాంబు కోసం గాలింపు చర్యలు చేపట్టారు. దీంతో ప్రయాణికుల్లో కూడా తీవ్ర ఆందోళనలకు గురయ్యారు. అయితే గంటల తరబడి గాలించినా బాంబు దొరక్కపోవడంతో చివరికి ఆ బెందిరింపు మెసేజ్ ఫేక్ అని అర్థమై అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం పోలీసులు ఆ మెయిల్ ఎక్కడినుంచి వచ్చిందో ట్రేస్ చేసే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది.
విమానాశ్రయ అధికారులు వెల్లడించిన సమాచారం మేరకు.. హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో హైదరాబాద్ నుంచి కోయంబత్తూరు వెళ్తున్న ఇండిగో విమానంలో బాంబు ఉన్నట్లు బెదిరింపు మెయిల్ వచ్చింది. దీంతో ఆ విమానాన్ని అత్యవసరంగా నిలిపివేసిన అధికారులు.. 6 గంటల పాటు చెక్ చేశారు. అయినా బాంబు దొరకలేదు. దీంతో ఎవరో కావాలనే బెదిరింపు మెయిల్ పంపినట్లు అర్థమై సైబర్ క్రైం డిపార్ట్‌మెంట్‌కు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం పోలీసులు ఆమెయిల్ ఐడీ ఆధారంగా నిందితులను కనిపెట్టే పనిలో పోలీసులు ఉన్నారు.