Blood samples: బ్లడ్ శాంపిల్స్ మీరే కలెక్ట్ చేయాలి.. నర్సింగ్ ఆఫీసర్లకు ఉత్తర్వులు జారీ

ఆస్పత్రుల్లో పేషెంట్లకు వైద్య సేవలు అందిస్తూనే, బ్లడ్ శాంపిల్స్ కూడా సేకరించాలని నర్సింగ్ ఆఫీసర్లకు ఉన్నతాధికారులు ఆదేశాలిస్తున్నారు.

Update: 2024-08-30 02:15 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ఆస్పత్రుల్లో పేషెంట్లకు వైద్య సేవలు అందిస్తూనే, బ్లడ్ శాంపిల్స్ కూడా సేకరించాలని నర్సింగ్ ఆఫీసర్లకు ఉన్నతాధికారులు ఆదేశాలిస్తున్నారు. సరిపడా ల్యాబ్ టెక్నీషియన్లు లేనందునా అదనపు పని చేయాలని సూచిస్తున్నారు. కొన్ని ఆస్పత్రుల్లో మౌఖిక ఆదేశాలతో వర్క్ చేయిస్తుండగా, మరి కొన్ని ఆస్పత్రులు ఉత్తర్వులు ఇస్తున్నాయి. తాజాగా, నాగర్ కర్నూల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ ఇచ్చిన ఆదేశాలపై నర్సింగ్ ఆఫీసర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆస్పత్రుల్లో రోగుల రద్దీ అధికంగా ఉన్నదని, వార్డుల్లో సేవలందిస్తూనే.. మళ్లీ బ్లడ్ శాంపిల్స్ సేకరణ వర్క్ ఎలా చేయాలని ప్రశ్నిస్తున్నారు. తమపై అధిక పనిభారం పడుతుందని వాపోతున్నారు. అన్ని ఆస్పత్రుల్లో సరిపడా ల్యాబ్ టెక్నీషియన్లు నియమించుకోవాలని, తమతో ఆ వర్క్ చేయిస్తామంటే కుదరదని నొక్కి చెప్తున్నారు. ఇదే అంశంపై నర్సింగ్ యూనియన్లు హెల్త్ మినిస్టర్, సెక్రటరీని త్వరలో కలవనున్నారు.


Similar News