దక్షిణాది రాష్ట్రాలపై బీజేపీ ఫోకస్.. నేడు హైదరాబాద్లో బీజేపీ చీఫ్ల సమావేశం
లోక్ సభ ఎన్నికల కోసం బీజేపీ సన్నద్ధమవుతోంది. కర్ణాటక ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత బీజేపీ దక్షిణాది రాష్ట్రాలపై ఫోకస్ పెట్టింది.
దిశ, వెబ్ డెస్క్: లోక్ సభ ఎన్నికల కోసం బీజేపీ సన్నద్ధమవుతోంది. కర్ణాటక ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత బీజేపీ దక్షిణాది రాష్ట్రాలపై ఫోకస్ పెట్టింది. ఈ నేపథ్యంలోనే ఇవాళ సాయంత్రం హైదరాబాద్ వేదికగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుల సమావేశాన్ని నిర్వహించున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమానికి దక్షిణాది రాష్ట్రాల బీజేపీ అధ్యక్షులతో పాటు మొత్తం 11 రాష్ట్రాల అధ్యక్షులు హాజరవుతారని ఆ పార్టీ తెలిపింది. లోక్ సభ ఎన్నికల్లో గెలవడానికి తీసుకోవాల్సిన వ్యూహప్రతివ్యూహాల గురించి ఈ సమావేశంలో చర్చించనున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో బీజేపీ గెలిచేందుకు గలయాక్షన్ ప్లాన్ ను జేపీ నడ్డా పార్టీ నేతలకు వివరిస్తారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.
కాగా ఈ సమావేశంలో పాల్గొనడానికి జేపీ నడ్డా ఇప్పటికే హైదరాబాద్ కు చేరుకున్నారు. టీబీజేపీ చీఫ్ జి.కిషన్ రెడ్డి ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై వారిద్దరూ కొంతసేపు చర్చించినట్లు తెలుస్తోంది. కాగా సాయంత్రం సాయంత్రం బీజేపీ అధ్యక్షుల సమావేశం ముగిసిన వెంటనే జేపీ నడ్డా మరోసారి రాష్ట్ర నేతలతో భేటీ అవుతారని ఆ పార్టీ రాష్ట్ర నాయకులు చెబుతున్నారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా 6 నెలలే సమయమే ఉండటంతో ఎన్నికల్లో గెలిచేందుకు కావాల్సిన స్ట్రాటజీలపై రాష్ట్ర నేతలకు జేపీ నడ్డా దిశా నిర్దేశం చేయనున్నారని తెలుస్తోంది. కాగా ఇప్పటికే ఈ విషయమై జేపీ నడ్డా ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షాతో చర్చించినట్లు సమాచారం.