BJP: బీసీ రిజర్వేషన్లు అమలు చేసే వరకు పోరాడుతాం.. రాజ్యసభ ఎంపీ కే.లక్ష్మణ్
బీసీలను కాంగ్రెస్ పార్టీ(Congress Party) మోసం చేసిందని రాజ్యసభ ఎంపీ, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కే.లక్ష్మణ్(MP K.Lakshman) అన్నారు.
దిశ, వెబ్ డెస్క్: బీసీలను కాంగ్రెస్ పార్టీ(Congress Party) మోసం చేసిందని రాజ్యసభ ఎంపీ, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కే.లక్ష్మణ్(MP K.Lakshman) అన్నారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు బీసీలకు(BC) ఇచ్చిన హమీలను నెరవేర్చాలని, కామారెడ్డి డిక్లరేషన్(Kamareddy Decleration) పై రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) స్పందించాలని డిమాండ్ చేశారు. బీసీ సబ్ ప్లాన్(BC Sub Plan) కు చట్టబద్దత కల్పించి, జనాబాకు అనుగుణంగా బడ్జెట్ లో నిధులు కేటాయించి వారి అభివృద్ధికి పాటు పడాలన్నారు. ప్రతీఏటా బడ్జెట్ లో 20 వేల కోట్ల చొప్పున బీసీలకు ఐదేళ్లలో లక్ష కోట్లు కేటాయిస్తామని చెప్పి, అరకొర నిధులు కేటాయించి బీసీలకు అన్యాయం చేశారని ఆరోపించారు.
అన్నింటికీ మించి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు(Reservations) ఇస్తామని చెప్పారని, ఆ బాధ్యత మీపైనే ఉందని, 42 శాతం రిజర్వేషన్లతోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్లపై రాహుల్ గాంధీ మొసలి కన్నీరు కారుస్తున్నారని, రాహుల్ గాంధీకి బీసీల గురించి మాట్లాడే హక్కు లేదని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వంలో 27 మంది బీసీలకు మంత్రి పదవులు ఇచ్చిన ఘనత బీజేపీకే దక్కుతుందని స్పష్టం చేశారు. గతంలో కేసీఆర్, ఇప్పుడు రేవంత్ రెడ్డి బీసీలకు ఓట్ల కోసం మాత్రమే వాడుకున్నారని, 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసే వరకు బీజేపీ ఓబీసీ మోర్చా(BJP OBC Morcha) తరుపున పోరాటం చేస్తామని ఎంపీ లక్ష్మణ్ హెచ్చరించారు.