వక్ఫ్‌కు వ్యతిరేకంగా బీజేపీ బిల్ ప్రవేశ పెడుతుంది: ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ

ఇటీవల కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును ప్రవేశ పెట్టింది.

Update: 2024-08-25 09:26 GMT

దిశ, వెబ్ డెస్క్: ఇటీవల కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును ప్రవేశ పెట్టింది. దీనిపై ప్రతిపక్షాల నుంచి వ్యతిరేకత కూడా వచ్చింది. అయితే ఈ బిల్లుపై తాజాగా ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వక్ఫ్ బోర్డులో ముస్లీంలను లేకుండా చేయాలని బీజేపీ చూస్తోందన్నారు. మజీద్లు, దర్గాల లాగే.. వక్ఫ్ ఆస్తులు కూడా ప్రభుత్వ ప్రాపర్టీ కాదని.. ఎప్పటి నుంచో ఉన్న వక్ఫ్ ప్రాపర్టీ కి డీడ్ ఎలా ఉంటుందని.. మక్కా మసీదు కు డీడ్ కావాలంటే ఎక్కడ తేవాలని..ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అలాగే వక్ఫ్ బోర్డులో ఇద్దరు హిందువులను పెట్టాలని చూస్తొందని.. అలా చేయడం సరికాదని.. ఓవైసీ ఫైర్ అయ్యారు.


Similar News