MLA టికెట్ల కేటాయింపుపై బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు

బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు వాడీవేడిగా జరిగాయి. చంపాపేటలో నిర్వహించిన ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సీరియస్ అయ్యారు.

Update: 2023-05-22 11:47 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు వాడీవేడిగా జరిగాయి. చంపాపేటలో నిర్వహించిన ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సీరియస్ అయ్యారు. నేతలు కట్టు దాటితే వేటు తప్పదని వార్నింగ్ ఇచ్చారు. పార్టీ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇదిలా ఉండగా పార్టీ టికెట్లపై నేతలకు బండి సంజయ్ క్లారిటీ ఇచ్చారు. టికెట్లు కావాలంటే ప్రజల మధ్య ఉండాల్సిందేనని స్పష్టంచేశారు. క్షేత్ర స్థాయిలో పనిచేసే వారికే ప్రాధాన్యత ఉంటుందని ఆయన పేర్కొన్నారు. నిత్యం ప్రజలతో టచ్‌లో ఉండే వారికి సర్వేల ఆధారంగా టికెట్లు ఇవ్వనున్నట్లు స్పష్టం చేశారు. నేతలు క్రమశిక్షణ రాహిత్యానికి పాల్పడితే చర్యలు తప్పవని బండి సంజయ్ హెచ్చరించారు. షోపుటాప్ చేస్తే టికెట్లు రావని విషయాన్ని నాయకులు గుర్తుంచుకోవాలని స్వీట్ వార్నింగ్ ఇచ్చారు.

బీజేపీ రాష్ట్ర వ్యవహారావు ఇన్ చార్జీ సునీల్ బన్సల్ మాట్లాడుతూ.. క్రమశిక్షణ తప్పితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎవరు ఏం చేస్తున్నారు.. ఏం మాట్లాడుతున్నారనే ప్రతి డేటా జాతీయ పార్టీ దగ్గర సమాచారముందని బన్సల్ కామెంట్స్ చేశారు. మహాజన్ సంపర్క్ అభియాన్‌లో భాగాoగా 30 రోజుల పాటు ప్రతీ నాయకుడు ప్రజల్లోనే ఉండాలని ఆయన ఆదేశించారు. నేతలు వారి స్థానిక లోకల్ ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని సూచించారు. సొంత ఇమేజ్ కోసం కాకుండా.. పార్టీ కోసమే నేతలు పనిచేయాలని తరుణ్ చుగ్ వ్యాఖ్యానించారు. ఫ్లెక్సీల్లో సొంత ఫోటోలు కాకుండా.. పార్టీ గుర్తునే ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. నేతలు మనస్పర్థలు వీడాలని, అధిష్టానం దృష్టిలో ఎవరేంటో తెలుసని స్పష్టం చేశారు. పార్టీకి నష్టం కలిగించినా, పార్టీ లైన్ క్రాస్ చేసినా ఊరుకునేది లేదని, చర్యలు తప్పవని బన్సల్ హెచ్చరించారు. ఇదిలా ఉండగా ఇటీవల‌ ఢిల్లీ ఎపిసోడ్ లో హైదరాబాద్ మీడియా ఎదుట నేతలు చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో బన్సల్ కామెంట్స్ కు ప్రాధాన్యత చేకూరింది.

Also Read..

వచ్చే నెలలో BJP రెండు భారీ బహిరంగసభలు.. గెస్ట్‌లు వీరే! 

Tags:    

Similar News