మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై బీజేపీ మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలు సీరియస్
నాగచైతన్య, సమంతలతో పాటు టాలీవుడ్ హీరోయిన్లపై కాంగ్రెస్ నేత, రాష్ట్ర మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను బీజేపీ మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలు వనతీ తీవ్రంగా ఖండించారు.
దిశ, వెబ్‌డెస్క్: నాగచైతన్య, సమంతలతో పాటు టాలీవుడ్ హీరోయిన్లపై కాంగ్రెస్ నేత, రాష్ట్ర మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను బీజేపీ మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలు వనతీ శ్రీనివాసన్ తీవ్రంగా ఖండించారు. ఈ రోజు (శుక్రవారం) మీడియాతో మాట్లాడిన ఆమె.. రాష్ట్ర మంత్రిగా ఉన్న ఆమె ఇలాంటి వ్యాఖ్యలు చేయడం బాధాకరమని, మరొకరి కుటుంబం గురించి మాట్లాడడం కచ్చితంగా తప్పని వనతీ అన్నారు. రాజకీయ విమర్శల్లోకి ఇతరులను లాగడం సరికాదని, ఇలాంటి వ్యాఖ్యలు ఓ మహిళా మంత్రి నుంచి రావడం బాధకలిగించిందని చెప్పారు. అనంతరం బతుకమ్మ వేడుకల గురించి మాట్లాడుతూ.. కాంగ్రెస్‌కి హిందువుల పండగలంటే చిన్నచూపని, అందుకే బతుకమ్మ సంబరాలకు కూడా కోర్టు అనుమతి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.