'టీపీసీసీ ఎవరు ఉండాలో డిసైడ్ చేసేది కేసీఆరే'

టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు తోడు దొంగలని కాంగ్రెస్‌కు ఓటు వేస్తే టీఆర్ఎస్‌కు వేసినట్టే అని బీజేపీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె.లక్ష్మణ్ ఆరోపించారు. వివిధ పథకాల పేరుతో సీఎం కేసీఆర్ తెలంగాణను దోచుకుంటున్నాడని విమర్శించారు.

Update: 2022-10-22 12:55 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు తోడు దొంగలని కాంగ్రెస్‌కు ఓటు వేస్తే టీఆర్ఎస్‌కు వేసినట్టే అని బీజేపీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె.లక్ష్మణ్ ఆరోపించారు. వివిధ పథకాల పేరుతో సీఎం కేసీఆర్ తెలంగాణను దోచుకుంటున్నాడని విమర్శించారు. మునుగోడు నియోజకవర్గంలో శనివారం బీజేపీ అభ్యర్థి తరపున ప్రచారం నిర్వహించిన ఆయన టీఆర్ఎస్, కాంగ్రెస్‌లపై విరుచుకుపడ్డారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్ని వర్గాల కోసం అభివృద్ధి పనులు చేస్తుంటే కేసీఆర్ మాత్రం తన కుటుంబం బాగు కోసం పని చేస్తున్నాడని దుయ్యబట్టారు. కేసీఆర్ కేబినెట్‌లో ఆయన కొడుకు, కూతురు, అల్లుడికి మాత్రమే సామాజిక న్యాయం జరిగిందని సైటైర్లు వేశారు. టీపీసీసీ ఎవరు ఉండాలనేది కేసీఆరే నిర్ణయిస్తారని కాంగ్రెస్‌కు ఓటు వేస్తే అది టీఆర్ఎస్ ఖాతాలోకే వెళ్తుందన్నారు.

ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు టీఆర్ఎస్ ప్రయత్నాలు చేస్తోందని అయితే ఎన్ని కుట్రలు చేసిన మునుగోడు ప్రజలు బీజేపీ వైపు నిలబడతారని ధీమా వ్యక్తం చేశారు. కాగా, మునుగోడు ప్రచారంలో నేతల మధ్య విమర్శల పర్వం జోరందుకుంది. TRS, BJP మధ్య టఫ్ ఫైట్ నడుస్తోంది. స్వామి గౌడ్, దాసోజు శ్రవణ్‌లు బీజేపీని వీడి టీఆర్ఎస్‌లో చేరడంపై బీజేపీ నేతలు రియాక్ట్ అవుతున్నారు. ఇద్దరు పార్టీని వీడినంత మాత్రన బీజేపీకి జరగబోయే నష్టం ఏమీ లేదని చెబుతున్నారు. త్వరలో తమ పార్టీలోకి పెద్ద ఎత్తున చేరికలు ఉండబోతున్నాయని బీజేపీ నేతలు చేస్తున్న కామెంట్స్ హాట్ టాపిక్‌గా మారాయి. ఈక్రమంలో మునుగోడులో ఈ నెల 31న భారీ బహిరంగ సభను నిర్వహించేలా రాష్ట్ర బీజేపీ నాయకత్వం ప్రణాళికలు వేస్తోంది. అదే రోజు కీలక పరిణామాలు చోటుచేసుకుంటాయనే ప్రచారం జరుగుతోంది.

Tags:    

Similar News